ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ట్రోఫీలు గెలిచిన టీమ్‌గా ముంబై ఇండియన్స్‌తో కలిసి తొలి స్థానంలో ఉన్న సీఎస్‌కే ఈ సీజన్‌లో మాత్రం గతంలో ఎప్పుడూ లేని విధంగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన చెన్నై కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి, ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం 4 పాయింట్లు, -1.276 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.
డెవాల్డ్ బ్రెవిస్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఒక విధ్వంసక బ్యాటర్ చేరాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను సీఎస్కే జట్టులో చేర్చారు. ఐపీఎల్ ట్వీట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. స్టార్ బౌలర్ గుర్జప్నీత్ సింగ్ స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్ జట్టులోకి తీసుకున్నారు. గాయం కారణంగా గుర్జప్నీత్ సింగ్ మొత్తం టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది రెండో ఎదురుదెబ్బ. అంతకు ముందు జట్టు రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కు దూరమైన సంగతి తెలిసిందే.ఫాస్ట్ బౌలర్ గుర్జప్నీత్ సింగ్ గాయం కారణంగా జట్టుకు దూరమైన తర్వాత డెవాల్డ్ బ్రెవిస్‌ను జట్టులోకి తీసుకున్నారు. డెవాల్డ్ బ్రెవిస్ గతంలో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఫ్యాన్స్ బేబీ ఏబీ డెవిలియర్స్ అని పిలిచుకునే డెవాల్డ్ బ్రెవిస్ ఇటీవల దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 291 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 48 సగటుతో 184 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. గత సీజన్‌లో ముంబై డెవాల్డ్ బ్రెవిస్‌కు కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం ఇచ్చింది. ఆ సమయంలో డెవాల్డ్ బ్రెవిస్ బ్యాట్ నుంచి 69 పరుగులు వచ్చాయి.
గుర్జప్నీత్ సింగ్
మరో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా గుర్జప్నీత్ సింగ్ ఇకపై టోర్నమెంట్ లో పాల్గొనలేడు. అంతకు ముందు రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కు దూరమయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ లేకపోవడంతో ఎంఎస్ ధోని మరోసారి జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గత మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో చెన్నై జట్టు లక్నో సూపర్ జెయింట్స్ ను వారి సొంత మైదానంలో 5 వికెట్ల తేడాతో ఓడించింది.
Read Also: IPL 2025: అంపైర్ల జీతం ఎంతో తెలుసా!