ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ (Damian Martin) ప్రాణాంతకమైన మెనింజైటిస్ వ్యాధి బారినపడి కోలుకున్నారు. గతేడాది డిసెంబర్ చివరిలో ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించారు.కోమా నుంచి బయటకు వచ్చాక మాట్లాడటానికి, నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. వైద్యుల సహాయంతో ఆయన కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: WPL 2026: దిల్లీతో మ్యాచ్.. టాస్ గెలిచిన ఆర్సీబీ
సపోర్ట్ చేసిన వారికి థాంక్యూ
గత నెల, డిసెంబర్ 27న నా జీవితం తలకిందులైంది. ఒక్క క్షణంలో లైఫ్ ఎలా మారిపోతుందో తెలిసింది. 8 రోజులు కోమాలో ఉన్నా. బతికేందుకు 50-50 ఛాన్స్ ఉండగా కోమా నుంచి బయటపడ్డా. కానీ నడవలేకపోయా. ఇప్పుడు కోలుకున్నా. బీచ్‌లో నిల్చోగలిగా. సపోర్ట్ చేసిన వారికి థాంక్యూ’ అంటూ ఓ ఫొటో పోస్ట్ చేశారు.
డామియన్ మార్టిన్ (Damian Martin) ఆసీస్ తరఫున 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. ఆస్ట్రేలియా 1999, 2003 ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. భారత్‌తో జరిగిన 2003 వరల్డ్ కప్ ఫైనల్‌లో 88 పరుగులు చేశాడు. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో అతడు ఐదు ఇన్నింగ్స్‌ల్లో 80.33 యావరేజ్‌తో 241 పరుగులు చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: