IPL గురించి, దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ KL రాహుల్ (KL Rahul) చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రాహుల్ తన కెప్టెన్సీ అనుభవాలను పంచుకుంటూ, IPLలో కెప్టెన్ పై పడే ఒత్తిడి అంతర్జాతీయ క్రికెట్ కంటే ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.IPLలో క్రీడలతో సంబంధంలేని వారికీ కెప్టెన్ వివరణలు ఇవ్వాల్సి ఉంటుందని DC బ్యాటర్ KL రాహుల్ (KL Rahul) తెలిపారు.
Read Also: India: 66 ఏళ్ల తర్వాత తొలిసారి: టెస్టులో 200 దాటని భారత్ నాలుగు ఇన్నింగ్స్‌లు.

సమీక్షల్లో పాల్గొనాలి, యాజమాన్యానికి వివరణివ్వాలి
’10 నెలల ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన దానికంటే 2 నెలల IPLకే ఎక్కువ అలసిపోయాను. కెప్టెన్‌గా చాలా కష్టపడ్డాను. సమీక్షల్లో పాల్గొనాలి, యాజమాన్యానికి వివరణివ్వాలి. కోచ్‌లు, కెప్టెన్లను ఎన్నో ప్రశ్నలడుగుతారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అలా ఉండదు. ఆట తెలిస్తే ఎలా ఫెయిలయ్యామో చెప్తే అర్థమవుతుంది’ అని తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: