ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా, ఫ్రాంచైజీలు క్రికెట్ అసోసియేషన్స్ మధ్య వార్ కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ల మధ్య గొడవ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కాంప్లిమెంటరీ పాస్‌ల కోసం హెచ్‌సీఏ బ్లాక్ మెయిల్ చేస్తుందని, హైదరాబాద్‌ను వీడుతామని సన్‌రైజర్స్ హైదరాబాద్ మెయిల్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. చివరకు హెచ్‌సీఏ తలొగ్గి చర్చలు జరపడంతో గొడవ సద్దుమణిగింది.
జైదీప్ బిహానీ
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతోంది. ఆ జట్టు ప్రస్తుతం రెండు విజయాలు, ఐదు పరాజయాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక, గెలుపు ముంగిట బోల్తా పడడం అభిమానులను కలవర పెడుతోంది. గత రెండు మ్యాచుల్లో ఇదే జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్‌లో కేవలం తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో మ్యాచ్‌ను కోల్పోయింది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్‌సీఏ), రాజస్థాన్ రాయల్స్ జట్టు మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్‌సీఏ) అడ్‌హక్ కమిటీ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే జైదీప్ బిహానీ ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడంపై జైదీప్ సందేహాలు వ్యక్తం చేశారు.హోమ్ గ్రౌండ్‌లో విజయం ఖాయమనుకున్న దశలో ఎలా ఓడిపోయిందంటూ ప్రశ్నించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
అధికారి
అయితే ఈ ఆరోపణలపై తాజాగా బీసీసీఐ స్పందించింది.రాజస్థాన్ క్రికెట్ చేసిన ఆరోపణలలో ఎలాంటి నిజం లేదంటూ బీసీసీఐ వర్గాలు స్పష్టత ఇచ్చాయి.”రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ లో త్వరలోనే ఎన్నికల జరగబోతున్నాయి. దీని చుట్టూ ఎంతో డ్రామా జరుగుతోంది. ప్రతిఒక్కరు అటెన్షన్ కావాలి. ఇప్పటికే బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం 24 గంటల పాటూ ఐపీఎల్‌పై కన్నెసి ఉంచింది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు.” అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.ఈ ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఆరంభం నుంచే మెరుగైన ప్రదర్శన చేయలేకపోతుంది. దీంతో రాజస్థాన్ మ్యాచ్‌లను వీక్షించే ప్రేక్షకులు తగ్గిపోయారు. సాధారణంగా రాజస్థాన్ మ్యాచ్‌లకు 1800 టికెట్ల కన్నా ఎక్కువగా అమ్ముడుపోయేవి. కానీ ఇప్పుడు వెయ్యి నుంచి 1200 వరకే టికెట్లు అమ్ముడుపోతున్నాయని తెలిసింది.
Read Also: Akshar Patel: ఢిల్లీ క్యాపిటల్స్ విజయం పై స్పందించిన అక్షర్ పటేల్