हिन्दी | Epaper

IPL 2026: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్

Aanusha
IPL 2026: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్

IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైన వేళ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టోర్నీ ఆరంభానికి ముందే జట్లు పాటించాల్సిన ప్రాక్టీస్ సెషన్లు, పిచ్ నిర్వహణపై కఠినమైన మార్గదర్శకాలను ప్రకటించింది.

Read Also: Ambati Rayudu: ఐపీఎల్ పాత జ్ఞాపకాలను పంచుకున్న అంబటి రాయుడు

ఏ జట్టు కూడా సాధన సమయంలో తమ ప్రత్యర్థి ఉపయోగించిన పిచ్‌లను లేదా నెట్‌లను వాడకూడదు. ప్రతి సెషన్‌కు తాజాగా సిద్ధం చేసిన పిచ్‌లను తప్పనిసరిగా అందించాలి. ఉదాహరణకు, ఉదయం ‘టీమ్ బి’ ఉపయోగించిన పిచ్‌పై సాయంత్రం ‘టీమ్ ఎ’ సాధన చేయకూడదు.జట్లు ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, మొదటి జట్టు ఉపయోగించిన నెట్‌లను రెండవ జట్టుకు ఇవ్వరాదు.

ఇది ‘రేంజ్ హిట్టింగ్’ పిచ్‌లకు కూడా వర్తిస్తుంది.ప్రతి జట్టు గరిష్టంగా 2 ప్రాక్టీస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడగలదు. దీనికి బోర్డు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి.ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లు 3.5 గంటలకు మించకూడదు.ఒక జట్టు మొదటి లోకల్ మ్యాచ్‌కు 4 రోజుల ముందు వరకు ప్రధాన పిచ్ లేదా సెంట్రల్ స్క్వేర్‌లో ఎలాంటి ప్రాక్టీస్ లేదా శిక్షణా మ్యాచ్‌లు నిర్వహించరాదు. ఈ కాలంలో స్వదేశీ జట్టుకు వేరే ప్రాక్టీస్ గ్రౌండ్ అవసరమైతే, రాష్ట్ర క్రికెట్ సంఘాలు దానిని ఉచితంగా అందించాలి.

BCCI new rules for IPL teams
BCCI new rules for IPL teams

సమయం, ప్రాధాన్యత: ప్రాక్టీస్ స్లాట్‌లను ఎంపిక చేసేటప్పుడు ఆతిథ్య జట్టుకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అయితే, ముందు రోజు మ్యాచ్ ఉన్నా లేదా ప్రయాణ ఒత్తిడి ఉన్నా, సందర్శక జట్ల అభ్యర్థనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.ప్రాక్టీస్ సమయంలో భోజనం, వైద్య సంరక్షణ మరియు, భద్రతకు సంబంధిత హోమ్ టీమ్ పూర్తిగా బాధ్యత వహిస్తుంది.నిర్దేశిత మైదానాల్లో ప్రాక్టీస్ కోసం రెండు నెట్‌లను, ప్రధాన మైదానంలో రేంజ్-హిట్టింగ్‌కు అవకాశం కల్పించాలని బీసీసీఐ అన్ని జట్లను ఆదేశించింది.

ఈ నియమం ఎందుకు?

ముందుగా సాధన చేసే జట్టుకు పిచ్ అనుకూలంగా ఉంటుంది. తర్వాత వచ్చే జట్టుకు అనుకూలంగా ఉండదు. దీనిని నివారించి, రెండు జట్లకు సమాన నాణ్యత గల పిచ్ అందేలా చూడటమే లక్ష్యం.ఉపయోగించే బంతులు అసమతుల్యంగా ఎగిరిపడవచ్చు. దీనివల్ల బ్యాటర్లకు గాయాలు కావచ్చు.మ్యాచ్ రోజున పిచ్ ఎలా ఉంటుందో ఖచ్చితమైన అంచనా వేయడానికి కొత్త పిచ్‌లు అవసరం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870