हिन्दी | Epaper
తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20

Latest News: Sana Mir: ఆజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పేది లేదన్న సనా మిర్

Anusha
Latest News: Sana Mir: ఆజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పేది లేదన్న సనా మిర్

మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. వచ్చే ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. అంతకుముందు గురువారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన బంగ్లాదేశ్ – పాకిస్తాన్ మ్యాచ్‌లో ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ సనా మీర్ (Sana Mir) కామెంటరీ సందర్భంగా ఆజాద్ కాశ్మీర్ అనే వివాదాస్పద పదాన్ని ఉపయోగించి పెద్ద దుమారాన్ని రేపింది.

Abhishek Sharma: యువీ ముందే చెప్పాడు గెలుస్తామని: అభిషేక్

ఐసీసీ (ICC) నిబంధనల ప్రకారం, క్రీడల్లో రాజకీయాలను కలపడం కఠినంగా నిషేధించబడింది. ఈ నేపథ్యంలో సనా మీర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆమెను కామెంటరీ ప్యానల్ నుంచి నిషేధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

అయితే,ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. క్రీడాకారిణి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని చెప్పడమే తన ఉద్దేశమని, అనవసరంగా దీన్ని రాజకీయం చేయవద్దని హితవు పలికింది.

సనా మీర్ కామెంటేటర్‌గా వ్యవహరించింది

మహిళల ప్రపంచకప్ 2025 (Women’s World Cup 2025) క్వాలిఫయర్స్‌లో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు సనా మీర్ కామెంటేటర్‌గా వ్యవహరించింది. ఈ సందర్భంగా పాక్ క్రీడాకారిణి నటాలియా పర్వేజ్ (Natalia Parvez) గురించి మాట్లాడుతూ.. “నటాలియా పర్వేజ్ కశ్మీర్ నుంచి వచ్చింది. ఆజాద్ కశ్మీర్ నుంచి” అని వ్యాఖ్యానించింది.

క్రికెట్ కెరీర్ కోసం ఆమె లాహోర్‌లో ఎక్కువగా శిక్షణ తీసుకుంటుందని చెప్పింది. అయితే, లైవ్ మ్యాచ్‌లో ‘ఆజాద్ కశ్మీర్’ (పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్థాన్ పిలుచుకునే పేరు) అనడంపై భారత అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వ్యాఖ్య అని, క్రీడా వేదికపై ఇలాంటివి తగవని సోషల్ మీడియా వేదికగా ఆమెను ఏకిపారేశారు.

Sana Mir
Sana Mir

నా వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేయడం బాధాకరం

విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో సనా మీర్ (Sana Mir) ఎక్స్ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చింది. “నా వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేయడం బాధాకరం. ఓ క్రీడాకారిణి నేపథ్యం, ఆమె ఎదుర్కొన్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయాలనే సదుద్దేశంతోనే నేను మాట్లాడాను. ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ప్రస్తావించాను తప్ప, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు.

దయచేసి క్రీడల్లోకి రాజకీయాలను లాగొద్దు” అని ఆమె ఘాటుగా స్పందించారు.”వ్యాఖ్యాతలుగా క్రీడాకారుల కథలను చెప్పడం మా బాధ్యత. అదే రోజు మరో ఇద్దరు పాక్ క్రీడాకారిణుల నేపథ్యం గురించి కూడా మాట్లాడాను. నేను పరిశోధన చేసినప్పుడు నటాలియా ప్రొఫైల్‌లో ఆమెది ‘ఆజాద్ కశ్మీర్’ అనే ఉంది. అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ (Screenshot) ను కూడా ఇక్కడ జత చేస్తున్నాను.

వివాదం తలెత్తిన తర్వాత ఇప్పుడు ఆ ప్రొఫైల్‌ను మార్చడం గమనార్హం. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే, అది నా ఉద్దేశం కాదు” అని స్పష్టం చేసింది. అయితే, ఆమె వివరణ ఇచ్చినప్పటికీ, క్షమాపణ మాత్రం చెప్పలేదు. ఈ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇంతవరకు స్పందించలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870