ఆస్ట్రేలియా (Australia) మహిళల క్రికెట్ జట్టుకు కొత్త ఆల్–ఫార్మాట్ కెప్టెన్‌గా 28 ఏళ్ల బౌలింగ్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్‌ను ఆసీస్ క్రికెట్ ప్రకటించింది. ఇది ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఒక కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఇప్పటివరకు జట్టును విజయవంతంగా నడిపించిన అలిస్సా హీలీ స్థానంలో మోలినెక్స్ ఈ బాధ్యతలు చేపట్టనుంది. యువ వయసులోనే ఇంత పెద్ద బాధ్యతలు దక్కడం ఆమె ప్రతిభకు, నాయకత్వ లక్షణాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
Read Also: Yuvraj Singh: తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ

మోలినెక్స్ స్పందన ఇదే
భారత మహిళల జట్టుతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న టీ20 సిరీస్ నుంచి మోలినెక్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనుంది. అయితే ఈ టూర్‌లో మోలినెక్స్ కేవలం టీ20 జట్టుకు మాత్రమే కెప్టెన్సీ చేయనుంది. అలిస్సా హీలీ వన్డే, టెస్ట్ జట్టును నడిపిస్తుంది. ఈ సిరీస్ తర్వాత హీలీ నుంచి టెస్ట్, వన్డే, టీ20 పగ్గాలను మోలినెక్స్ చేపడుతుంది. “ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఎంపికవడం నిజంగా గౌరవం. నేను చాలా గర్వపడుతున్నాను” అని మోలినెక్స్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: