Arjun Tendulkar Wedding Photos: భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్, సానియా వివాహం ఈ నెల (మార్చి) 5న ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకలో అర్జున్, సానియా ఒక్కటయ్యారు. ఈ వేడుకకు క్రీడా లోకంతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Read Also: Sunrisers: పాక్ ప్లేయర్ ఎంపిక ఎఫెక్ట్.. సన్‌రైజర్స్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్!
ఆనంద క్షణాలను పంచుకున్న సారా టెండూల్కర్
అర్జున్ టెండూల్కర్ సోదరి సారా టెండూల్కర్, ఈ వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని అరుదైన, ఆనందకరమైన క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫోటోలను పోస్ట్ చేశారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో కలిసి సారా దిగిన ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో టెండూల్కర్ కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా కనిపిస్తోంది.వివాహ వేడుకలోని ఆనంద క్షణాలను షేర్ చేయగా అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: