
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచ కప్ 2026 అధికారిక గీతం విడుదల కావడంతో క్రీడాభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. “ఫీల్ ద థ్రిల్” అనే పేరుతో రూపొందించిన ఈ పాటను ప్రముఖ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) స్వరపరచి, నిర్మించి, స్వయంగా ఆలపించడం విశేషం. ఈ గీతాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి, ఐసీసీ ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా విడుదల చేసింది.
Read Also: Vijay: MGR, జయలలితలే నాకు రాజకీయ స్ఫూర్తి
సోనిక్ హార్ట్‌బీట్ గా
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి మరింత ఉత్సాహాన్ని నింపేలా ఈ గీతాన్ని రూపొందించారు. ఈ పాటకు హీసెన్‌బర్గ్ ఆంగ్లంలో సాహిత్యం అందించగా, రకీబ్ ఆలం హిందీలో రాశారు. టోర్నీకి ఇది “ప్రధాన సంగీత స్పందన” (సోనిక్ హార్ట్‌బీట్)గా నిలుస్తుందని ఐసీసీ అభివర్ణించింది.
ప్రస్తుతం ఈ పాట యాపిల్ మ్యూజిక్, యూట్యూబ్ మ్యూజిక్ వంటి అన్ని ప్రధాన ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.టీ20 క్రికెట్‌లోని వేగానికి, ఉత్కంఠకు ఈ పాట అద్దం పడుతుందని ఐసీసీ పేర్కొంది. ఈ పాట విడుదల, టోర్నీకి సంబంధించిన మార్కెటింగ్, ప్రచార కార్యక్రమాలలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: