हिन्दी | Epaper

Amit Shah: టీమిండియా అద్భుతంగా ఆడింది

Anusha
Amit Shah: టీమిండియా అద్భుతంగా ఆడింది

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో భారత్–పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన పోరు మరోసారి క్రికెట్ అభిమానులకు మర్చిపోలేని అనుభూతిని అందించింది. కోట్లాది మంది అభిమానుల అంచనాల మధ్య సాగిన ఈ కీలక మ్యాచ్‌లో భారత జట్టు 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఈ విజయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు. టీమిండియా అద్భుతంగా ఆడిందంటూ కితాబిచ్చారు.

Read Also: Shoaib Akhtar: PCB చైర్మన్‌పై మండిపడ్డ మాజీ ఫాస్ట్ బౌలర్

ప్రతి ఆటగాడు తమ పాత్రను పూర్తి చేసారు

ఫార్మాట్లు, వేదికలు, తేదీలు మారినా పాకిస్థాన్‌పై టీమిండియా గెలుపు మాత్రం స్థిరంగా ఉంటోందని పేర్కొన్నారు. టీమిండియాకు ఆయన అభినందనలు తెలియజేశారు.పాకిస్థాన్‌పై విజయం సాధించిన టీమిండియాకు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్‌పై ప్రశాంతంగా, ధైర్యంగా భారత జట్టు అద్భుత విజయం సాధించిందని అన్నారు.

టీ20 మ్యాచ్‌లలో పాకిస్థాన్‌పై భారత్ విజయాలు 8-1కి చేరుకోవడం గొప్ప విషయమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు.భారత జట్టు కలిసికట్టుగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. వారి ప్రదర్శన గర్వకారణమని పేర్కొన్నాడు. టీమిండియాలోని ప్రతి ఆటగాడు ప్రశాంతంగా, బలంగా తమ పాత్రను పూర్తి చేశారని ప్రశంసించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

📢 For Advertisement Booking: 98481 12870