ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యం తమ పట్టుదల ఏంటో మరోసారి నిరూపించుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green) ను KKR సొంతం చేసుకుంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన వేలంలో, కామెరూన్ గ్రీన్ ఏకంగా రూ. 25.20 కోట్ల రికార్డ్ ధర పలికాడు. అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన ఈ మినీ వేలంలో కామెరూన్ గ్రీన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ భారీ ధరకు కొనుగోలు చేసింది.
Read Also: Josh Hazlewood: యాషెస్ సిరీస్‌కు హాజిల్‌వుడ్ దూరం
అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా కామెరూన్
రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కోసం కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఐపీఎల్ (IPL) చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా కామెరూన్ గ్రీన్ (Cameron Green) నిలిచాడు. ఈ క్రమంలో అతను మిచెల్ స్టార్క్ రికార్డ్‌ను అధిగమించాడు. ఐపీఎల్ 2024 మినీవేలంలో స్కార్క్‌ను కేకేఆర్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది.

సీఎస్‌కే వెనుకడుగు వేయడంతో ఐపీఎల్ ఆల్‌టైమ్ అత్యధికర ధర రిషభ్ పంత్(రూ.27 కోట్లు)రికార్డ్ చెక్కుచెదరకుండా ఉంది. వేలంలో రూ. 25.20 కోట్లు పలికినా కామెరూన్ గ్రీన్‌కు రూ.18 కోట్లు మాత్రమే దక్కనున్నాయి. మిగతా రూ.7.20 కోట్ల బీసీసీఐ (BCCI) ఖాతాలో చేరుతాయి. విదేశీ ఆటగాడికి ఎవరికైనా గరిష్టంగా రూ. 18 కోట్లు మాత్రమే దక్కేలా బీసీసీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: