టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఫామ్‌పై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా (Akash Chopra) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కెప్టెన్ పని కేవలం టాస్ వేసి, బౌలర్లను మార్చడమే కాదని, పరుగులు చేయడం కూడా అతని బాధ్యత అని చురకలంటించాడు. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో చోప్రా ఈ వ్యాఖ్యలు చేశాడు.తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, “మీరు జట్టుకు కెప్టెన్.
Read Also: Messi: మెస్సీతో ఫొటో.. ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారంటే?
కానీ కెప్టెన్సీ అంటే టాస్ వేయడం, వ్యూహాలు రచించడం మాత్రమే కాదు. టాప్-4లో బ్యాటింగ్ చేసేటప్పుడు పరుగులు చేయడం మీ ప్రధాన కర్తవ్యం. చాలా మ్యాచ్‌లు గడిచిపోయాయి. గత 17 ఇన్నింగ్స్‌లలో మీ సగటు 14 మాత్రమే. ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. ఇది ఆందోళన కలిగించే విషయం” అని చోప్రా తెలిపాడు.సూర్యకుమార్ (Suryakumar Yadav) తో పాటు వైస్-కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్ కూడా జట్టుకు పెద్ద తలనొప్పిగా మారిందని ఆకాశ్ చోప్రా ఆందోళన వ్యక్తం చేశాడు.

వీరిద్దరూ రాణించడం జట్టుకు అత్యవసరం
“కెప్టెన్, వైస్-కెప్టెన్ ఇద్దరూ పరుగులు చేయకపోతే, ప్రపంచకప్ బరిలోకి దిగేటప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండలేరు. వీరిద్దరూ రాణించడం జట్టుకు అత్యవసరం” అని అభిప్రాయపడ్డాడు. 2024 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ 26 ఇన్నింగ్స్‌లలో 18.73 సగటుతో 431 పరుగులు చేయగా, గిల్ 14 ఇన్నింగ్స్‌లలో 23.90 సగటుతో 263 పరుగులు మాత్రమే చేశాడు.
వీరిద్దరి వైఫల్యం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో జట్టు ఓటమికి కారణమైంది. 2026 ప్రపంచకప్‌కు ముందు కేవలం ఎనిమిది మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నందున, ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు త్వరగా ఫామ్ అందుకోవాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: