AndhraPradesh: గుంటూరు నుంచిస్పెషల్ రైలు..

AndhraPradesh: గుంటూరు నుంచిస్పెషల్ రైలు..

దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టారు. పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించేందుకు, అలాగే పండగలు (ఉగాది, రంజాన్) కారణంగా స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మొత్తం 26 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

చర్లపల్లి – కన్యాకుమారి ప్రత్యేక రైళ్లు

ప్రయాణ ప్రారంభం: ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు,చర్లపల్లి నుంచి బయలుదేరు సమయం: ప్రతి బుధవారం రాత్రి 9:50 గంటలకు,కన్యాకుమారి చేరే సమయం: రెండో రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు, తిరుగు ప్రయాణం: ఏప్రిల్ 4 నుంచి జూన్ 23 వరకు, కన్యాకుమారి నుంచి బయలుదేరు సమయం: ప్రతి శుక్రవారం తెల్లవారు జామున 5:15 గంటలకు,చర్లపల్లి చేరే సమయం: మరుసటి రోజు ఉదయం 11:40 గంటలకు నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుత్తణి, కాట్పాడి, విల్లుపురం, తిరుచిరాపల్లి, మధురై, తిరునెల్వేలి, నాగర్‌కోయిల్ మొదలైన ప్రధాన స్టేషన్లు.

ఇతర రైళ్ల పొడిగింపు వివరాలు

తమిళనాడులోని పలు ప్రధాన నగరాలకు రాకపోకలు సాగిస్తోన్న ప్రత్యేక రైళ్లను పొడిగించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. నంబర్ 07191 కాచిగూడ-మధురై ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు పొడిగించారు. 07192 మధురై- కాచిగూడ ఏప్రిల్ 9 నుంచి మే 7వ తేదీ, 07189 నాందెడ్- ఈరోడ్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 4 నుంచి మే 2 వరకు పొడిగించారు. 07190 ఈరోడ్- నాందెడ్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 6 నుంచి మే 4 వరకు, 07435 కాచిగూడ- నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 4 నుంచి మే 2 వరకు, 07436 నాగర్ కోయిల్- కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 6 నుంచి మే 4 వరకు, 07601 సికింద్రాబాద్- విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్ 3 నుంచి మే 1 వరకు, విల్లుపురం- సికింద్రాబాద్ ఏప్రిల్ 4 నుంచి మే 2వ తేదీ వరకు పొడిగించారు.

2 4

గుంటూరు – హుబ్లీ ప్రత్యేక రైళ్లు

ఇప్పుడు తాజాగా గుంటూరు నుంచి కర్ణాటకలోని హుబ్లీకి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఈ నెల 31వ తేదీన రాత్రి 8 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరే నంబర్ 07271 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 9:20 నిమిషాలకు శ్రీ సిద్ధారూఢ స్వామిజీ హుబ్లీ స్టేషన్‌కు చేరుకుంటుంది.నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుంతకల్, బళ్లారి, తోరణగల్లు, హొస్పేట్, మునీరాబాద్, గదగ్, అన్నిగేరి మొదలైన స్టేషన్లు.

రిజర్వేషన్

రైల్వే అధికారులు వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే అనేక రైళ్లను పొడిగించడంతో పాటు, కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు. రిజర్వేషన్ చేసుకోవాలనుకునే వారు ముందే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది.

Related Posts
ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అమరావతి సెక్రటేరియట్‌లోని రియల్‌ టైం గవర్నెన్స్‌ సొసైటీ పరిధిలో వివిధ విభాగాలకు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆర్‌టీజీఎస్‌, ఎవేర్‌ హబ్‌, Read more

విచారణకు హాజరైన పేర్ని జయసుధ
jayasuda police22

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బందరు తాలుకా Read more

మళ్లీ వార్తల్లోకి వచ్చిన ముద్రగడ
mudragada

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లో నిలిచాడు. అప్పట్లో ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచినా Read more

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఇ.ఎస్.ఐ. వైద్యులుపై, వేటు తప్పదు
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే

ఇ.ఎస్.ఐ. ఆసుపత్రుల ఉద్దేశం విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఇ.ఎస్.ఐ.కార్మికులకు ఉచితంగా ఉత్తమ వైద్య సేవలు అందజేయాలనే లక్ష్యంతోనే ఇ.ఎస్.ఐ. ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. అయితే, ఆ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *