తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు: సింగర్ కల్పన వీడియో విడుదల

సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం: అసలు కారణం ఏమిటి?

ప్రముఖ గాయని కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, ఈ ఘటనకు ఆమె కూతురుతో జరిగిన మనస్పర్థలే కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం: అసలు కారణం ఏమిటి?

కూతురితో గొడవ
కల్పన పెద్ద కూతురు కేరళలో నివసిస్తోంది. మంగళవారం కూతురిని ఫోన్ ద్వారా హైదరాబాద్‌కు రావాలని కోరారు. కానీ కూతురు కేరళలోనే ఉంటానని, రావలేనని చెప్పడంతో తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ సంఘటనతో కల్పన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆత్మహత్యాయత్నం ఎలా జరిగింది?
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిద్రమాత్రలు మింగారు. సాయంత్రం 4:30 గంటలకు భర్త ప్రసాద్ చెన్నై నుండి ఫోన్ చేశారు. కల్పన ఫోన్ లిఫ్ట్ చేయలేదు, పలుమార్లు ప్రయత్నించినా సమాధానం రాలేదు.
విల్లా సెక్రటరికి సమాచారం ఇచ్చిన భర్త, అతడు తలుపు తట్టినా కల్పన తెరవలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టారు. అపస్మారక స్థితిలో పడివున్న కల్పనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం కల్పన ఆరోగ్య పరిస్థితి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పన ఇప్పుడు నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కూతురితో వాగ్వాదం జరిగినట్లు స్పష్టమైంది. అయితే, ఇతర కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కూడా తీసుకుంటున్నారు. ఇతర వ్యక్తులు, కుటుంబ సమస్యలు కూడా కారణంగా ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. కల్పన భర్త ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కూతురితో సంబంధిత గొడవే ప్రధాన కారణమా? లేక ఇతర కుటుంబ సమస్యలూ కారణమా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Related Posts
Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ , బిఆర్ఎస్ లపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్
Maheshwar Reddy

బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసగించి, డూప్ ఫైట్ చేస్తున్నాయని Read more

పీజీ మెడికల్‌ సీట్లలో స్థానిక కోటా.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు: ఉదయనిధిపై కొత్త ఎఫ్ఐఆర్ లకు సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే

న్యూఢిల్లీ : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం అనుమతించింది. Read more

మూసీలో ఇండ్ల కూల్చివేతలు ప్రారంభం..
Demolition of houses has st

మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి. చాదర్‌ఘాట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను మంగళవారం ఉదయం అధికారులు ప్రారంభించారు.RB- X అని రాసి, ఇళ్ళు ఖాళీ చేసిన Read more

ఈడీ నోటీసులపై స్పందించిన కేటీఆర్‌
KTR responded to ED notices

హైదరాబాద్‌: ఫార్ములా-ఈ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. ఈ నెల 7న విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో Read more