భారత్‌కు చెందిన స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి,చిరాగ్ శెట్టి జోడీ సింగపూర్ ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో, శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ 21-19, 10-21, 18-21తో మలేషియాకు చెందిన ఆరోన్ చియా, సోహ్ వుయ్ యిక్(Aaron Chia, Soh Wei Yik) చేతిలో ఓటమి పాలైంది.మ్యాచ్ ప్రారంభం నుంచే రెండు జట్లు సమంగా తలపడ్డాయి.టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన సాత్విక్, చిరాగ్ సెమీస్‌లో అదే జోరు కొనసాగించలేకపోయారు. 64 నిమిషాల్లో ముగిసిన పోరులో తొలి గేమ్‌ను దక్కించుకున్న ఈ మాజీ వరల్డ్ నంబర్‌వన్ జోడీ వరుస గేములను చేజార్చుకుని ఓటమివైపు నిలిచారు. ఇటీవలే గాయం నుంచి తేరుకుని తొలిసారి బరిలోకి దిగిన సాత్విక్, చిరాగ్ జంట అంచనాలకు మించి రాణించింది. క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జోడీని ఓడించిన ఈ స్టార్ ద్వయం సెమీస్ గండాన్ని దాటలేకపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖి పోరులో 3-9తో పోటీకి దిగిన సాత్విక్, చిరాగ్‌కు నిరాశే ఎదురైంది.

విజయం
తొలి గేమ్‌ను భారత జోడీ మెరుగైన సమన్వయం, అద్భుతమైన నెట్ ప్లే ద్వారా 21-19తో కైవసం చేసుకుంది. మొదటి గేమ్‌లో చిరాగ్ ఆహ్లాదకరమైన డ్రైవ్స్, సాత్విక్ పవర్‌ఫుల్ స్మాష్‌లు ప్రత్యర్థులకు కాస్త అడ్డుకట్ట వేసినట్లయినా, రెండో గేమ్‌లో మలేషియా జోడీ(Malaysian couple) ధాటిగా మళ్లీ బలంగా పుంజుకుంది.రెండో గేమ్‌లో మలేషియా జోడీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆరోన్ చియా, సోహ్ వుయ్ యిక్ అద్భుత రిటర్న్‌లు, ఫాస్ట్ నెట్ కంట్రోల్‌తో భారత జోడీపై గెలిచారు. ఫలితంగా రెండో గేమ్‌ను కోల్పోయింది భారత్ జోడీ.తుది నిర్ణయాత్మకమైన మూడో గేమ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. రెండు జట్లూ ఒకదానిని మించేందుకు తీవ్రంగా శ్రమించాయి.అనంతరం మలేషియా జోడీ కీలక పాయింట్లను సొంతం చేసుకుని విజయం సాధించింది.
Read Also: Karun Nair : ద్విశతకంతో అదరగొట్టిన కరుణ్ నాయర్