విశాఖపట్నంలో ప్రసిద్ధి గాంచిన సింహాచలం ఆలయంలో నేడు, రేపు గిరి ప్రదక్షిణ మహోత్సవం (Simhadri Appanna) జరగనుంది. ఏటా ఆషాఢ మాసంలో జరిగే ఈ పవిత్ర కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి భక్తులు హాజరవుతారు. ఈ సంవత్సరం సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తూ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 32 కిలోమీటర్ల పాటు సాగే ఈ ప్రదక్షిణ మార్గం భక్తులతో నిండి పోవనున్నది.
సురక్షితంగా ప్రదక్షిణ నిర్వహణకు ఏర్పాట్లు
భక్తుల సౌకర్యార్థం విశాఖ పోలీసులు, జిల్లా యంత్రాంగం సమగ్ర ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి 6 కిలోమీటర్లకు ఒక అధికార బృందం పర్యవేక్షణ కోసం నియమించబడినట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. భద్రతతో పాటు శాంతియుతంగా గిరి ప్రదక్షిణ పూర్తి కావాలని అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లను తీసుకుంది.
వైద్య సదుపాయాలు, సేవా కార్యక్రమాలు
భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసేందుకు అధికారాలు ప్రత్యేక దృష్టి సారించారు. 32 వైద్య శిబిరాలు, 18 అంబులెన్సులు, వైద్య బృందాలు ప్రదక్షిణ మార్గం వద్ద ఏర్పాటుచేయబడ్డాయి. భక్తులకు తాగునీరు, ఆహారం, విశ్రాంతి కేంద్రాలు వంటి సేవలూ అందుబాటులో ఉండనున్నాయి. సింహాచల అప్పన్నకు గిరిప్రదక్షిణ చేసే భాగ్యాన్ని పొందాలన్న భక్తిశ్రద్ధతో భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవానికి తరలివస్తున్నారు.
Read Also : YSR : త్వరలో అభ్యుదయ రైతులకు వైఎస్ఆర్ పేరుమీద అవార్డులు – భట్టి