అమెరికాలో కిటకిటలాడుతున్న షాపింగ్ మాల్స్

Donald Trump: అమెరికాలో కిటకిటలాడుతున్న షాపింగ్ మాల్స్

అమెరికాలోని షాపింగ్ మాల్స్ గత కొన్ని వారాలుగా కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దిగుమతులపై విధిస్తున్న సుంకాలే. దిగుమతి సుంకాల పెంపు కారణంగా ధరలు పెరగనుండడంతో, వస్తువుల ధరలు పెరగకముందే కొనుగోలు చేసేందుకు ప్రజలు షాపింగ్ మాల్స్ కు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాల కొనుగోళ్లు భారీగా పెరిగాయని పలు సర్వేలు చెబుతున్నాయి.

Advertisements
అమెరికాలో కిటకిటలాడుతున్న షాపింగ్ మాల్స్

32% వరకు ధరలు పెరిగే అవకాశంతో రద్దీ
కొత్త టారిఫ్ విధానం కారణంగా తైవాన్ నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై సుమారు 32% వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, కెమెరాలు వంటి వస్తువులు ధరలు భారీగా పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు. దాంతో, ఇలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. చాలామంది ప్రజలు భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే భయంతో ముందస్తు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.
సుంకాల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం
ఈ పరిస్థితిపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుంకాల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి… నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.
నేటి నుంచి అమలు
ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు ఏప్రిల్ 5 నుంచి అమలులోకి వచ్చాయి. ప్రారంభంలో 10% సుంకం వసూలు చేస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్ 10 నుంచి విధిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే, కొన్ని దిగుమతులకు మే 27 వరకు గ్రేస్ పీరియడ్ ఉండటంతో ఆ లోపు సరుకులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Related Posts
ఆపిల్ పరిమాణంలో మిస్టరీ మోలస్క్: సముద్రం యొక్క మిడ్నైట్ జోన్ లో కొత్త జీవి
mbari mystery mollusc d0598 02

అమెరికాలోని సైంటిస్ట్‌లు సముద్రం యొక్క గహనతను ఆవిష్కరించడంలో కృషి చేస్తున్నారు. తాజాగా, సముద్రం యొక్క "మిడ్నైట్ జోన్" అనే ప్రదేశంలో ఒక కొత్త రహస్య జీవి కనుగొనబడింది. Read more

ఐఈఈఈ జీఆర్ఎస్ఎస్ ఎస్ వై డబ్ల్యు 2024 ను నిర్వహించిన కెఎల్‌హెచ్‌ అజీజ్ నగర్
KLH Aziz Nagar organized IEEE GRSS SYW 2024

న్యూఢిల్లీ : హైదరాబాదులోని కెఎల్‌హెచ్‌ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ఐఈఈఈ జియోసైన్స్ మరియు రిమోట్ సెన్సింగ్ సొసైటీ (జీఆర్ఎస్ఎస్) స్టూడెంట్ , యంగ్ ప్రొఫెషనల్ మరియు Read more

Gold Price : ట్రంప్ దెబ్బకు భారీగా పడిపోయిన బంగారం ధరలు
ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు! 10 గ్రాముల పసిడి రూ. 90,450

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల వల్ల ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు ఇటీవల చుక్కలను తాకాయి. సంక్షోభ సమయంలో సురక్షిత Read more

ఉద్యోగుల గౌరవాన్ని పెంచాలి ..నారాయణమూర్తి కీలక కామెంట్స్!
ఉద్యోగుల గౌరవాన్ని పెంచాలి ..నారాయణమూర్తి కీలక కామెంట్స్!

నేటి కాలంలో ఐటీ పరిశ్రమలో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. కంపెనీల వ్యవస్థాపకులతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు మాత్రం యువతను 70-90 గంటల వరకు పనిచేయాలని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×