technology company

బెంగళూరులో తెలుగు ఐటీ ఉద్యోగులకు షాక్

ప్రపంచములో ఎక్కడ చూసినా ఒకటే మాట ఉద్యోగులకు భద్రత లేదు. బెంగళూరులోని ఎక్కువ మంది నివసించే వారిలో ఐటీ ఉద్యోగులది సింహభాగం. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో గడచిన కొన్ని నెలలుగా కర్ణాటక వ్యాప్తంగా కన్నడిగ నినాదం వినిపిస్తోంది. స్థానికులకే ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో అగ్రస్థానం కల్పించాలని వారు కోరుకుంటున్నారు. దీనికి అనుగుణంగా కర్ణాటక ప్రభుత్వం సైతం ఒక బిల్లును తీసుకొచ్చింది. అయితే పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో దానిని కొన్ని గంటల్లోనే సిద్ధరామయ్య ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇది మరువక మునుపే గతవారం సోషల్ మీడియాలో కన్నడిగులకు ఉద్యోగాల నియామకంలో ప్రాథాన్యత ఇవ్వాలంటూ ట్వీట్ సంచలనం రేపింది.

కర్ణాటకలో యువత ఉద్యోగాల కోసం రోడ్లపై యుద్ధం చేయకుండా.. నియమించుకునే స్థాయిలో ఉన్న కీలక ఉద్యోగులు, వ్యవస్థాపకులు పొరుగువారిపై కనికరం చూపకుండా కన్నడిగులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఒక వ్యక్తి చేసిన ట్వీట్ పెద్ద చర్చకు దారితీసింది. దీని తర్వాత తాజాగా ఇదే అంశంపై మరోసారి పెద్ద చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న ఉత్తర భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో దీనిపై చేసిన వీడియో వైరల్ అవుతోంది. కర్ణాటకలో జరుగుతున్న భాష, సాంస్కృతిక చర్చలో కన్నడిగులకు తన మద్దతును అందించాడు. కర్ణాటక ఈ విషయంలో సరైన వైపున వాదిస్తోందని అన్నాడు. ప్రస్తుతం కర్ణాటక ప్రజలపై చాలా ద్వేషం పెరుగుతోందని, అయితే వారి భూమి, వారి సంస్కృతి, వారి వారసత్వం, వారి గుర్తింపును కాపాడుకునే హక్కు వారికి ఎల్లప్పుడూ ఉంటుందని సదరు వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశాడు.

Related Posts
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ముందు వీరికే ప్రాధాన్యం – సీఎం రేవంత్
CM Revanth is ready to visit Davos

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేదవారి సొంతింటి కలను సాకారం Read more

సూసైడ్ లెటర్ చెల్లుబాటు కాదు, ఆధారాలు కావాలి: సుప్రీంకోర్టు

ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంలో దోషిగా తేలిన వ్యక్తిని సుప్రీంకోర్టు నిర్ధోషిగా విడుదల చేసింది. నిందితుడు మృతురాలిని అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడని, తద్వారా ఆమె ఆత్మహత్యకు Read more

కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే
Former MLA Koneru Konappa said goodbye to Congress

స్వతంత్రంగా ఉంటానని ప్రకటించిన కోనేరు కోనప్ప హైదరాబాద్‌: బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప.. కొన్ని నెలలకే ఆ పార్టీకి గుడ్ Read more

సంధ్య థియేటర్ విషాదం నేపథ్యంలో బెనిఫిట్ షోలపై నిషేధం – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Benefit Show Ban in Telanga

హైదరాబాద్‌ నగరంలోని సంధ్య థియేటర్ వద్ద ఇటీవల జరిగిన ప్రమాదంలో పలువురు అభిమానులు గాయపడగా, కొంతమంది ప్రాణాలు కోల్పోయిన విషాదం అందరిని కుదిపేసింది. ఈ ఘటనపై స్పందించిన Read more