వల్లభనేని వంశీ కేసులో టీడీపీకి షాక్!

వల్లభనేని వంశీ కేసులో టీడీపీకి షాక్!

ఏపీలో గత ఎన్నికలకు ముందు జరిగిన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా 88 మందికి భారీ ఊరట లభించింది. అప్పట్లో టీడీపీ ఆఫీసుపై దాడి చేశారంటూ వల్లభనేని వంశీతో పాటు మొత్తం 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విచారణ తుది దశకు చేరుకుందని భావిస్తున్న తరుణంలో ఫిర్యాదు దారు అయిన టీడీపీ ఆఫీసు ఆపరేటర్ సత్యవర్ధన్ భారీ ట్విస్ట్ ఇచ్చాడు.

Advertisements

అప్పట్లో గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై వల్లభనేని వంశీ ప్రోత్సాహంతో విజయవాడ నుంచి వచ్చిన వైసీపీ నేతలతో పాటు స్థానిక నేతలు కూడా దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై అట్రాసిటీ కేసు సహా పలు కేసులు నమోదు చేశారు. ఈ దెబ్బకు వంశీ అమెరికాకు వెళ్లినపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మిగతా నిందితులు మాత్రం కోర్టు విచారణలకు హాజరవుతున్నారు. ఈ తరుణంలో కేసు యూటర్న్ తీసుకుంది. ఈ కేసులో అప్పట్లో వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసిన గన్నవరం టీడీపీ ఆఫీసు ఉద్యోగి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. అప్పట్లో తనను సాక్షిగా పెట్టి కేసు నమోదు చేశారని, సంతకం తీసుకున్నారని ఆయన నేరుగా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో మెజిస్ట్రేట్ వద్దకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. తనకూ ఈ కేసుతో సంబంధం లేదని తేల్చిచెప్పేశారు. ఈ నేపథ్యంలో బెయిలు కోసం కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, బెయిలు కోసం కింది కోర్టునే ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో వారు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ ప్రారంభమైంది. అసలు ఆ దాడి జరిగినప్పుడు తాను అక్కడ లేనని కూడా సత్యవర్ధన్ తేల్చేశారు. దీంతో పాటు తనకు పోలీసుల రక్షణ కల్పించాలని, ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్కడ లేనని న్యాయాధికారి హిమబిందుకు వివరిస్తూ తన వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేసి తీసుకొచ్చిన సీడీతోపాటు అఫిడవిట్ అందజేశారు. ఈ కేసులో పోలీసులు తనను సాక్షిగా పిలిచి సంతకం తీసుకున్నారని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో విచారణను కోర్టు నేటికి (మంగళవారం) వాయిదా వేసింది. దీంతో ఇవాళ కోర్టు తన నిర్ణయం వెల్లడించనుంది.

మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైసీపీ హయాంలో దాడి జరిగినా అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు కీలక నిందితుల్ని మాత్రం అరెస్టు చేయలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పక్కాగా ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు కావడం తథ్యమని టీడీపీ నేతలు భావించారు. కానీ ఇప్పుడు ఫిర్యాదు దారే యూటర్న్ తీసుకోవడంతో వంశీ సహా 88 మంది బయటపడే అవకాశం ఉంది. అదే సమయలో టీడీపీకి భారీ షాక్ తప్పడం లేదు.

Related Posts
PSLV-C59 రాకెట్ ప్రయోగం వాయిదా
PSLV C59

శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈ రోజు 4:08 నిమిషాలకు జరగాల్సిన PSLV-C59 రాకెట్ ప్రయోగం తాత్కాలికంగా వాయిదా పడింది. యూరోపియన్ శాస్త్రవేత్తలు ప్రోబో-3 ఉపగ్రహంలో సాంకేతిక Read more

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు.

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈనెల 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇవాళ ఉదయం 9 Read more

జేసీకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్
జేసీకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివాదం చెలరేగింది. నటి, బీజేపీ నేత మాధవీలతపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి Read more

HighCourt: సినిమా నిర్మాణ వ్యయంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
HighCourt: సినిమా నిర్మాణ వ్యయంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

సంక్రాంతికి వస్తున్నాం దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య Read more

×