శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్ అనే పేర్లు వినగానే మనకు క్రికెట్ మైదానంలో వారి జోష్, వినూత్న ఆటతీరు గుర్తుకు వస్తుంది. కానీ ఇటీవల వారు చూపించిన మరో కోణం మాత్రం అభిమానులను ఆశ్చర్యపరిచేలా చేసింది. మైదానంలో కేవలం వికెట్లు పడగొట్టడానికే కాదు, ప్రేక్షకులను నవ్వించడానికీ వీరికి సమర్థత ఉందని మరోసారి నిరూపించారు. తాజాగా శిఖర్ ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ వీడియోను పంచుకున్నారు, ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో శిఖర్ ధావన్ (Shikhar Dhawan) “దుర్యోధనుడు”గా, యుజ్వేంద్ర చాహల్ “శకుని మామ”గా దర్శనమిచ్చారు. ఇద్దరూ మహాభారతంలోని ఒక ఐకానిక్ డైలాగ్‌పై అద్భుతమైన అభినయం ప్రదర్శించారు. ఇద్దరు ఆటగాళ్ల సాంప్రదాయ రాజ వస్త్రధారణ, హావభావాలు చాలా శక్తివంతంగా ఉన్నాయి.
వేల సంఖ్యలో
దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఇన్‌స్టా, ట్విట్టర్‌లలో అభిమానులు సరదాగా స్పందించడం ప్రారంభించారు. అభిమానులు వారి వీడియోపై మీమ్స్ (memes) చేయడం కూడా ప్రారంభించారు. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది చూశారు. వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. అభిమానులు మీమ్స్‌ని సృష్టించి, వారి నటనను అసలు టీవీ నటీనటులతో పోల్చారు. చాలా మంది వారి పోస్ట్‌లపై వ్యాఖ్యానిస్తూ, “క్రికెట్ శకుని, దుర్యోధనుడు తిరిగి వచ్చారు” అని రాశారు.
యాక్టింగ్ క్లిప్
శిఖర్ ధావన్,యుజ్వేంద్ర చాహల్ మైదానంలోనే కాదు, మైదానం బయట కూడా తమ సరదా శైలితో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ (Entertain) చేస్తుంటారు. ఈ జోడి గతంలో కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, సరదా డ్యాన్స్ వీడియోలు, యాక్టింగ్ క్లిప్‌ల ద్వారా అభిమానులను అలరించారు. అందుకే సోషల్ మీడియాలో శిఖర్ ధావన్,యుజ్వేంద్ర చాహల్‌కు లక్షల్లో ఫాలోయింగ్ ఉంది. అభిమానులు వారి జోడిని ఎంతగానో ఇష్టపడతారు.
Read Also: IND vs ENG: ఫస్ట్ ఎవరు ఆడాలో మార్గనిర్దేశం చేసిన కార్తీక్, అశ్విన్