భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది.అయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకున్న ధవన్, ప్రస్తుతం ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ అనే యువతితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.ధవన్, సోఫీ షైన్ ప్రేమలో ఉన్నారనే వార్తలకు ఇటీవల మరింత బలం చేకూరింది. దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా, స్టేడియంలో ధవన్‌తో పాటు సోఫీ షైన్ కనిపించడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ కలిసి కనిపించడంతోనే అభిమానుల్లో పలు ఊహాగానాలు మొదలయ్యాయి.
పెళ్లి, విడాకులు
ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని ధావన్ 2012లో పెళ్లాడాడు. మనస్పర్థలు రావడం వల్ల కొంతకాలం దూరంగా ఉన్న వీరు తాము విడిపోతున్నట్లు 2021లో వెల్లడించారు. ఈ క్రమంలోనే తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ ధావన్ దిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేసుకున్నాడు. గతేడాది వీరికి విడాకులు మంజూరు అయ్యాయి. అయితే ఐర్లాండ్ కు చెందిన సోఫీ షైన్ తో ధావన్ డేటింగ్ చేస్తున్నాడని ఇటీవల కాలంలో వార్తలు వచ్చాయి. వాటికి గబ్బర్ తాజాగా వివరణ ఇచ్చాడు.
ధవన్ క్లారిటీ
అయితే టైమ్స్ నౌ సమ్మిట్ నిర్వహించిన కార్యక్రమంలో ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ధవన్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.పేరు చెప్పలేను కానీఆమె అద్భుత సౌందర్యవతి అని గబ్బర్ ప్రేమను కన్ఫర్మ్ చేసినట్లే తెలిపాడు.17 నెలల క్రితం అయేషా నుంచి విడాకులు తీసుకున్న ధవన్ ప్రస్తుతం ఈ ఐర్లాండ్ అమ్మాయి సోఫీ షైన్‌తో కలిసి ఉన్నట్లు సమాచారం. 2024లో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ధవన్ చాంపియన్స్ ట్రోఫీకి బ్రాండ్ అంబాసీడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

చాహల్ కూడా ప్రేమలో పడ్డాడ
ఇటీవల టీమ్ ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తో విడాకుల అనంతరం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్‌వశ్ తో ప్రేమలో ఉన్నట్లు గాసిప్,ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది.తాజాగా మహ్‌వశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో “హస్బెండ్” అనే వీడియో పోస్ట్ చేయగా, ఆ వీడియోకు చాహల్ లైక్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో నెటిజన్లలో చాహల్, మహ్‌వశ్ మధ్య ఏదో నడుస్తోందని చర్చ మొదలైంది.ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం చాహల్ మళ్లీ ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆర్జే మహ్‌వశ్ తో చాహల్ డేటింగ్‌లో ఉన్నట్లు బీ టౌన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్‌గా దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను వీరిద్దరు కలిసి చూడడం.మ్యాచ్‌కు ముందు ఓ సెల్ఫీ వీడియో, ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకురింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచే కాకుండా పలు ఈవెంట్స్‌లో కూడా ఇద్దరూ జంటగానే మెరిశారు. దీంతో చాహల్ మహ్‌వశ్‌తో ప్రేమలో పడ్డట్లు టాక్ నడుస్తోంది.

యూట్యూబర్
దీంతో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.’చాహల్ ఇచ్చిన లైక్ శాశ్వతం’ అంటూ స్పందించారు.అలాగే ఈమె ఒక యూట్యూబర్ కూడా ఇక ఇంతకు మించి హైలైట్ ఏమిటంటే ఈమెకి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ ఫామ్ లో ఏకంగా 1.5 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.