ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి ప్రాంతం ఈసారి ఆక్వా రైతులతో కిటకిటలాడింది అక్కడ జరిగిన ఆక్వా రైతుల సమ్మేళనంలో రైతుల సమస్యలు ప్రభుత్వ ప్రణాళికలపై చర్చ జోరుగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది ఆక్వా రైతులు తమ ఆవేదనను గట్టిగా వ్యక్తపరిచారు. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, పీఎస్సీ ఛైర్మన్ రామాంజనేయులు, ఎంపీ బీదా మస్తాన్ రావు, జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. ట్రంప్ ప్రభుత్వం విధించిన ఎగుమతి సుంకాలు, వర్షపు నీటి ప్రభావం, విద్యుత్ చార్జీలు, ముడి సరుకుల ధరల పెరుగుదల రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోందని వారు వివరించారు. ముఖ్యంగా అమెరికాకు ఎగుమతులు తగ్గిపోవడం వల్ల రొయ్యల ధరలు పడిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అధికారులు ప్రభుత్వం రైతుల వెంటే ఉందని హామీ ఇచ్చారు.

అన్ని దశల్లో సహాయం చేస్తామని, త్వరలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక చేపడతామని చెప్పారు.డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ, “రాష్ట్ర ఆక్వా రైతులకు తగిన మద్దతు ఇవ్వడంలో ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడదు. నష్టాల నుంచి గట్టెక్కేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం,” అని భరోసా ఇచ్చారు. ఆయన చెప్పిన విధంగా ప్రభుత్వం ఇప్పటికే ఆక్వా రంగ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు.ఎంపీ బీదా మస్తాన్ రావు కీలక ప్రకటన చేశారు రొయ్యల ఫీడ్ ధరను కేజీకి రూ.4 మేర తగ్గించామని వెల్లడించారు. దీంతో రైతులకు కొంత ఊరట లభించనుంది.
అంతేకాకుండా భీమవరంలో రూ.80 లక్షల వ్యయంతో ఆధునిక ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ల్యాబ్ ద్వారా రొయ్యల శాస్త్రీయ పరీక్షలు వేగంగా జరిగేలా చేస్తామని వివరించారు. రైతుల ఆదాయం పెంచేందుకు అన్ని విధాలుగా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని ఎంపీ తెలిపారు త్వరలో అమరావతిలో ఆక్వా పరిశ్రమల ప్రతినిధులతో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేస్తామని, అక్కడే పరిష్కారాలపై కార్యాచరణ రూపొందిస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం ద్వారా ఆక్వా రైతులు కొంత ఊరట పొందారు. వారి సమస్యలను ప్రభుత్వానికి దగ్గరగా తీసుకెళ్లే వేదికగా ఈ సమ్మేళనం నిలిచింది. రాష్ట్రానికి ఆక్వా రంగం ముఖ్యమైన ఆదాయ వనరు కావడంతో, దీన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Read Also : Anna Lezhneva : తిరుమలకు పవన్ అర్ధాంగి అనా కొణిదెల