हिन्दी | Epaper
సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం

Shikhar Dhawan: ధావన్ కెరీర్ ముగియడానికి కారణమైన ఆటగాళ్లు ఎవరు?

Anusha
Shikhar Dhawan: ధావన్ కెరీర్ ముగియడానికి కారణమైన ఆటగాళ్లు ఎవరు?

భారత క్రికెట్ అభిమానులు ముద్దుగా ‘గబ్బర్’ అని పిలుచుకునే శిఖర్ ధావన్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికారు. తాను అంత త్వరగా ఈ మైదానాన్ని వదిలి వెళ్లిపోతానని తానే ఊహించలేదని ధావన్ తాజాగా ప్రకటించారు. తన ఆటను, శైలిని చూసి మినిమమ్ రెండేళ్లు తాను టీమిండియా (Team India) లో కొనసాగుతానని అనుకున్నానని ధావన్ తెలిపారు. కానీ పరిస్థితులు తారుమారు అయ్యాయి. కెరీర్ ప్రారంభంలో శిఖర్ ధావన్ ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ 2013లో శిఖర్ ధావన్ కెరీర్‌లో కొత్త మలుపు వచ్చింది. ప్రపంచం శిఖర్ ధావన్‌ను గుర్తించింది.

ఆత్మకథ ప్రకటన సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో

తన టెస్ట్ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా (Australia) పై అద్భుతమైన సెంచరీ చేసి తాను చాలా కాలం పాటు టీమిండియా కోసం ఓపెనింగ్ చేయబోతున్నానని నిరూపించాడు. శిఖర్ ధావన్ చాలా కాలం పాటు టీమిండియాకు ఓపెనింగ్ బ్యాటర్ గా వ్యవహరించాడు. కానీ త్వరలోనే శిఖర్ ధావన్ కెరీర్ ముగిసింది. అయితే భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన ఆత్మకథ “ది వన్”ను ప్రకటించారు. తన ఆత్మకథ ప్రకటన సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో శిఖర్ ధావన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ త్వరగా ముగియడానికి కారణమైన ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో శిఖర్ ధావన్ స్వయంగా ఇప్పుడు చెప్పుకొచ్చాడు.

డబుల్ సెంచరీ

ధావన్ వెల్లడించిన ప్రకారం, తన అంతర్జాతీయ కెరీర్ ముగియడానికి ప్రభావితం చేసిన ఇద్దరు ఆటగాళ్లు, ఒకరైన ఇషాన్ కిషన్ (Ishan Kishan) డబుల్ సెంచరీ చేసినప్పుడు తన కెరీర్ ముగియబోతుందని అర్థమైందని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. తనను జట్టు నుంచి తొలగించినప్పుడు ఎవరినీ సంప్రదించలేదని వెల్లడించాడు. జట్టు నుంచి తొలగించాక ఎవరికీ ఫోన్ చేయలేదని, అయితే కొంతమంది సహచరులు మాట్లాడి మద్దతు ఇచ్చారన్నారు. అయినా దీని గురించి అస్సలు నిరాశపడలేదని దానిని ఆస్వాదిస్తున్నట్లు శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.

Shikhar Dhawan: ధావన్ కెరీర్ ముగియడానికి కారణమైన ఆటగాళ్లు ఎవరు?
Shikhar Dhawan: ధావన్ కెరీర్ ముగియడానికి కారణమైన ఆటగాళ్లు ఎవరు?

నేను వన్డే జట్టులో మాత్రమే ఉన్నాను

శిఖర్ ధావన్ మాట్లాడుతూ “శుభ్‌మన్ గిల్ ఆ సమయంలో మూడు ఫార్మాట్లలో మంచి ప్రదర్శన చేస్తున్నాడు.అయితే నేను వన్డే జట్టులో మాత్రమే ఉన్నాను. అప్పుడు నా కెరీర్ ఎక్కువ కాలం కొనసాగదని నాకు అర్థమైంది.” అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. వన్డే ఫార్మాట్ శిఖర్ ధావన్‌ (Shikhar Dhawan) కు అత్యంత అద్భుతంగా ఉంది. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ 2015 వన్డే ప్రపంచ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేశాడు.

పరుగులు

శిఖర్ ధావన్ కెరీర్ చాలా అద్భుతంగా ఉంది. శిఖర్ ధావన్ టీమిండియా కోసం 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 34 టెస్ట్ మ్యాచ్‌ల 58 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేస్తూ ధావన్ 2315 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు (Half century) ఉన్నాయి. వన్డేలలో ధావన్ 6793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20లలో శిఖర్ ధావన్ 1759 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Read Also: Cricket journalists: నేడు ప్రపంచ క్రికెట్ జర్నలిస్టుల దినోత్సవం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870