हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Shikhar Dhawan: ధోనీని తొలిసారి చూసినప్పుడు బాలీవుడ్ హీరోలా కనిపించాడన్న శిఖర్ ధావన్

Anusha
Shikhar Dhawan: ధోనీని తొలిసారి చూసినప్పుడు బాలీవుడ్ హీరోలా కనిపించాడన్న శిఖర్ ధావన్

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఆత్మకథ “ద వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్”లో మహేంద్ర సింగ్ ధోనీతో తన తొలి పరిచయాన్ని ఆసక్తికరంగా గుర్తుచేసుకున్నాడు. భారత క్రికెటర్, మాజీ కెప్టెన్ ధోనీని తొలిసారి చూసినప్పుడు ఆయన రూపురేఖలు, వ్యక్తిత్వం బాలీవుడ్ హీరోలా అనిపించాయని ధావన్ పేర్కొన్నాడు. ధోనీ (Mahendra Singh Dhoni) ఆకర్షణీయమైన మొహం, ముద్దుగా తలపోసిన జుట్టు, హుందా బాడీ భాష తనను ఆవాక్కు చేసిందని వెల్లడించాడు.తన ఆత్మకథ ‘ద వన్ క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్ (The One Cricket, My Life and More)‘లో పేర్కొన్నాడు. ఈ బుక్‌లో శిఖర్ ధావర్ జ్ఞాపకాలతో పాటు లవ్ ఎఫైర్స్, స్నేహాల గురించి మైదానం లోపల, బయట తన చుట్టూ ఉన్న వివాదాల గురించి ప్రస్తావించాడు. ధోనీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

నాకు ధోనీ ఎంతో మద్దతు ఇచ్చాడు

ధోనీని బాలీవుడ్ సినిమాలో నటింపజేయాలనుకున్నాను. ధోనీని తొలిసారి కలిసినప్పుడు ఇదే విషయాన్ని అతనితో చెప్పాను. నేను భారత జట్టుకు ఆడాలనుకుంటున్నాను. అలాగే నిన్ను బాలీవుడ్ హీరో చేయాలనుకుంటున్నానని చెప్పాను. ఆ మాటలకు ధోనీ వెనక్కి వాలి నవ్వుకున్నాడు.కెరీర్ పరంగా నాకు ధోనీ ఎంతో మద్దతు ఇచ్చాడు. 2015 వన్డే ప్రపంచకప్ ముందు నా ప్రదర్శన బాలేకపోయినా, నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించాడు. అతని సహకారం నా మానసిక స్థితిని మార్చేసింది. సిడ్నీలోని బ్రహ్మకుమారీస్ ఆశ్రమాన్ని (Brahma Kumaris Ashramam) సందర్శించిన తర్వాత ధోనీని ఏం చేశావని అడిగాను. దానికి అతను రిలాక్స్ అయ్యానని, ధ్యానం చేశానని చెప్పాడు. ధోనీ ఓ దిగ్గజ, స్పూర్తిదాయకపమైన కెప్టెన్.’అని గబ్బర్ తన పుస్తకంలో పేర్కొన్నాడు.

Shikhar Dhawan: ధోనీని తొలిసారి చూసినప్పుడు బాలీవుడ్ హీరోలా కనిపించాడన్న శిఖర్ ధావన్
Shikhar Dhawan:

వ్యక్తిగత ప్రదర్శనలపై

తాను టీమిండియాలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సోషల్ మీడియా ప్రభావం లేదని, అప్పుడప్పుడే మొదలైందని ధావన్ తెలిపాడు. అప్పట్లో క్రికెటర్లపై దృష్టి మరీ ఎక్కువగా ఉండేది కాదని, జట్టు ఎంపిక ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలపై చర్చలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించేదని శిఖర్ ధావన్ (Shikhar Dhawan) గుర్తు చేసుకున్నాడు. కానీ ప్రస్తుత కాలంలో ఓ క్రికెటర్ రాత్రికి రాత్రే హీరో నుంచి జీరో కావచ్చిని అభిప్రాయపడ్డాడు. భారత్ తరఫున 34 టెస్ట్‌లు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన శిఖర్ ధావన్, మూడు ఫార్మాట్లలో 10వేలకు పైగా పరుగులు చేశాడు.

Read Also: West Indies: వెస్టిండీస్ క్రికెట‌ర్‌పై లైంగిక దాడి ఆరోప‌ణ‌లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870