షహీన్ అనుచిత ప్రవర్తన పై పాక్ విమర్శ..

షహీన్ అనుచిత ప్రవర్తన పై పాక్ విమర్శ..

ఛాంపియన్స్ ట్రోఫీ భాగంగా బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సఫారీ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్‌కేతో జరిగిన గొడవపై పాక్ స్పీడ్‌స్టర్ షహీన్ అఫ్రిది ఎట్టకేలకు నోరు విప్పాడు.పాకిస్తాన్-సౌతాఫ్రికా మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ 28వ ఓవర్‌లో షాహీన్ అఫ్రిది, మాథ్యూ బ్రిట్జ్కీ మధ్య గొడవ జరిగింది. అఫ్రిది వేసిన ఐదో బంతిని బ్రీట్జ్కీ మిడ్ ఆన్‌లోకి నెట్టి స్టీవ్ స్మిత్‌లా బ్యాట్‌తో ఒకలాంటి ఎక్స్‌ప్రషన్ ఇచ్చాడు. దాంతో అఫ్రిదీ దగ్గరగా వెళ్లి బ్రీట్జ్కీని ఏదో అన్నాడు. అతను కూడా అదే రేంజ్‌లో సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ తీస్తున్న సమయంలో అఫ్రిదిని బ్రీట్జ్కీ తగిలాడు. కోపంతో అఫ్రిది బ్యాటర్ మీదిమీదికి వెళ్లి చేతితో నెట్టాడు. వ్యవహారం ముదరడంతో అంపైర్లు జోక్యం చేసుకోవడంతో సర్దుమనిగింది.

Advertisements

తాజాగా స్పందించిన షహీన్ అఫ్రిది,క్రీజులో కుదురుకోకుండా చేయడంతోపాటు మాథ్యూ వికెట్ తీసే ఉద్దేశంతో టీజ్ చేశానని అంగీకరించాడు. మైదానంలో ఏం జరిగిందో, అది అక్కడే ముగిసింది. ఆ తర్వాత మేమిద్దరం కలుసుకున్నాం. చేతులు కలుపుకున్నాం. ఇద్దరం స్నేహితులమయ్యాం’’ అని షహీన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.ఈ గొడవ జరిగిన తర్వాతి ఓవర్‌లోనే సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా రనౌట్ అవడంతో పాక్ ఆటగాళ్లు హద్దుమీరారు. బవుమాను రనౌట్ చేసిన సౌద్ షకీల్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ ఇద్దరూ బవుమా దగ్గరకు వెళ్లి గట్టిగా అరిచి, గెటౌట్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చారు. ఆ సమయంలో ఫీల్డ్ అంపైర్లు కూడా దీన్ని తప్పుబట్టి కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌కు చెప్పారు.మైదానంలో అనుచిత ప్రవర్తన కారణంగా షహీన్ తన మ్యాచ్ ఫీజులో 25 శాతాన్ని జరిమానాగా చెల్లించుకోవలసి వచ్చింది. కాగా, ఈ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన సౌతాఫ్రికా ఓటమి పాలైంది. గెలిచిన పాక్ నేడు న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో తలపడనుంది.

TOPSHOT CRICKET NZL RSA ODI 1 1739181839563 1739182524861

జరిమానా విధింపు

ఈ ఘర్షణ కారణంగా షహీన్ అఫ్రిది తన మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాగా చెల్లించాల్సి వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో చివరికి సౌతాఫ్రికా ఓటమి పాలైంది. గెలిచిన పాకిస్తాన్ నేడు న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో తలపడనుంది.

పాక్-న్యూజిలాండ్ ఫైనల్

ఈ మ్యాచ్‌లో షహీన్ అఫ్రిది మరియు పాకిస్తాన్ సత్తా ప్రదర్శించినప్పటికీ,

ఐసీసీ సీరియస్

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు హద్దులు మీరి ప్రవర్తించారు. సఫారీ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కీ, కెప్టెన్ బవుమా‌తో దురుసుగా ప్రవర్తించినందుకు ముగ్గురు పాక్ ప్లేయర్లకు ఐసీసీ మొట్టికాయలు వేసింది.

Related Posts
కరేబియన్‌లో భారత విద్యార్ధిని గల్లంతు
కరేబియన్‌లో భారత విద్యార్థిని గల్లంతు – కుటుంబం ఆందోళనలో

అమెరికాలోని పిట్స్‌బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి అనే భారత సంతతికి చెందిన యువ విద్యార్థిని అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సుదీక్ష గత Read more

సానియా సమాధానంతో పగలబడి నవ్విన అభిమానులు
సానియా సమాధానంతో పగలబడి నవ్విన అభిమానులు – వైరల్ వీడియో

భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా గురించి ఎప్పుడూ వార్తల్లో నిలిచే అంశాలు కొన్ని ఉంటాయి. ఆమె ఆటలో సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియాలో Read more

స్వీడన్, నార్వే యుద్ధానికి సిద్ధం: ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ఎలా మారిపోతుంది?
NATO

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు యుకె ప్రధాని కీర్ స్టార్మర్ ఉక్రెయిన్‌ను శక్తివంతమైన ఆయుధాలతో సన్నద్ధం చేసేందుకు ATACMS మరియు స్టార్మ్ షాడో ఆయుధ వ్యవస్థలను Read more

అభిమానులతో రోహిత్ శ‌ర్మ‌
అభిమానులతో రోహిత్ శ‌ర్మ‌

భార‌త జ‌ట్టు త‌న ఛాంపియ‌న్స్ ట్రోఫీ మ్యాచ్‌ల‌ను దుబాయ్ వేదిక‌గా ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే జ‌రిగిన రెండు మ్యాచ్‌ల‌లో విజయం సాధించి సెమీస్‌కు అర్హ‌త సాధించింది. Read more

Advertisements
×