हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Anand Shah: అమెరికాలో భార‌త సంత‌తి రాజకీయ‌నేత‌పై పలు ఆరోప‌ణ‌లు

Vanipushpa
Anand Shah: అమెరికాలో భార‌త సంత‌తి రాజకీయ‌నేత‌పై పలు ఆరోప‌ణ‌లు

అమెరికాలో భార‌త సంత‌తి మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ ఆనంద్ షాపై మాఫియా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. గ్యాంబ్లింగ్ ఆప‌రేష‌న్ న‌డిపిస్తున్న‌ట్లు అత‌నిపై అభియోగాలు మోపారు. న్యూజెర్సీ అటార్నీ జ‌న‌ర‌ల్ మాథ్యూ ప్లాట్కిన్ ఆరోపించారు. మాఫియా త‌ర‌హా గ్యాంబ్లింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్న ఆనంద్ షా… రాకెటీరింగ్‌, గ్యాంబ్లింగ్‌, మ‌నీ ల్యాండ‌రింగ్ కు పాల్ప‌డుతున్నట్లు తేలింది.
39 మందిలో 42 ఏళ్ల ఆనంద్ షా కూడా ఒక‌రు
ఇక అభియోగాలు న‌మోదైన 39 మందిలో 42 ఏళ్ల ఆనంద్ షా కూడా ఒక‌రు అని అటార్నీ జ‌న‌ర‌ల్ వెల్ల‌డించారు. రాష్ట్రంలోని 12 ప్ర‌దేశాల్లో త‌నిఖీలు నిర్వ‌హించిన త‌ర్వాత ఈ అభియోగాలు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. ఈ క్ర‌మంలో మొత్తం నాలుగు పోక‌ర్ క్ల‌బ్‌ల‌పై దాడులు నిర్వ‌హించిన‌ట్లు పేర్కొన్నారు.

అమెరికాలో భార‌త సంత‌తి రాజకీయ‌నేత‌పై పలు ఆరోప‌ణ‌లు

స‌మిర్ ఎస్ నంద‌క‌ర్ణిపై కూడా అభియోగాలు
అలాగే ఫ్లోరిడాకు చెందిన మ‌రో భార‌త సంత‌తి వ్యక్తి స‌మిర్ ఎస్ నంద‌క‌ర్ణిపై కూడా అభియోగాలు న‌మోదు అయ్యాయి. పోక‌ర్ హోస్ట్ అని అత‌నిపై కేసు న‌మోదు చేశారు. 39 మంది గ్యాంగ్ స్పోర్ట్స్‌బుక్ గ్యాంబ్లింగ్ పేరుతో స్పోర్ట్స్ టోర్నీల‌పై బెట్టింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 3 మిలియ‌న్ల డాల‌ర్ల గ్యాంబ్లింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్న‌ట్లు విచార‌ణలో తేలింది.

కీల‌క రాజ‌కీయ‌నేత‌గా ఎదుగుతున్నఆనంద్ షా

కాగా, న్యూజెర్సీలో ఆనంద్ షా ఓ కీల‌క రాజ‌కీయ‌నేత‌గా ఎదుగుతున్నారు. న్యూయార్క్ శివారు ప్రాంతం ప్రాస్పెక్ట్ పార్క్‌లో అత‌ను మున్సిప‌ల్ కౌన్సిల‌ర్‌గా ఇటీవ‌ల‌ రెండోసారి ఎన్నిక‌య్యారు. ఎక‌నామిక్ డెవ‌ల‌ప్మెంట్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్ ఇంచార్జీగా కొన‌సాగుతున్నారు. కౌన్సిల్ స‌భ్యుడిని అరెస్టు చేయ‌డం అంటే ప్ర‌జ‌ల్లో ఎన్నికైన వ్య‌క్తుల‌పై విశ్వాసాన్ని కోల్పోవ‌డ‌మే అవుతుంద‌ని ఈ సంద‌ర్భంగా అటార్నీ జ‌న‌ర‌ల్ మాథ్యూ ప్లాట్కిన్ పేర్కొన్నారు.

READ ALSO: Donald Trump: భారత ఐటీ రంగంపై ట్రంప్ పిడుగు..కోలుకొని దెబ్బే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870