మరణం ఎప్పుడెక్కడ వస్తుందో చెప్పలేం.ఇది శాశ్వత సత్యం. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో రాత్రి నిద్రపోయిన మనిషి ఉదయం కన్ను తెరిస్తాడో లేదో కూడా గ్యారెంటీ లేదు. అలాంటి విషాద సంఘటనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad railway station)లో చోటుచేసుకుంది.ఇలానే కొత్తగా పెళ్లైన ఓ జంట రైలులో హనుమూన్కు వెళుతుండగా ట్రైన్ ఆలస్యం వరుడి ప్రాణాలు బలిగొంది. దీంతో గమ్యం చేరకుండానే వారి ప్రయాణం విషాదంగా ముగిసింది.సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ పట్టణానికి చెందిన రమేశ్ కుమారుడు ఉరగొండ సాయి (28) స్థానికంగా గిప్ట్ ఆర్టికల్స్(Gift articles) తయారీ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడికి 3 నెలల క్రితం వివాహం అయింది. వివాహం అయిన తర్వాత కొత్త జంట హనీమూన్ ప్లాన్ చేసుకొని గోవా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు రైల్వే టికెట్లు కూడా రిజర్వేషన్ చేసుకున్నారు.
ఆలస్యం కావడంతో
గోవా వెళ్లడానికి, శుక్రవారం ఉదయం భార్య, బావమరిది, నలుగురు స్నేహితులతో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే రైలు రైల్వేస్టేషన్లో 9వ నంబరు ప్లాట్‌ఫాంపై ఆగి ఉంది. అందరూ వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్(Vascoda Gama Express) ఎక్కి తమ తమ సీట్లలో కూర్చోగా, రైలు బయలుదేరడానికి ఆలస్యం కావడంతో ప్లాట్‌ఫాంపై ఉన్న స్టాల్లో వాటర్ బాటిల్ కొనేందుకు సాయి రైలు దిగాడు.

ఆసుపత్రికి తరలించారు
అతడు దిగి వాటర్ బాటిల్ కొంటుండగా, అంతలోనే రైలు బయలుదేరడంతో బోగీలో ఉన్న స్నేహితులు చైన్ లాగారు. దీంతో రైలు ఆగింది. ఏం జరిగిందోనని ఆర్పీఎఫ్ పోలీసులు బోగీలోకి వెళ్లి ప్రశ్నించారు. వారంతా విషయం చెప్పారు. దీంతో సాయి స్నేహితులైన ఇద్దరు యువకులను పోలీసులు ప్లాట్‌ఫాంపైకి తీసుకువచ్చారు. అప్పుడే రైలు ఎక్కిన సాయి విషయం తెలుసుకొని తిరిగి ప్లాట్‌ఫాం మీదకు చేరుకున్నాడు.అక్కడున్న పోలీసులకు ఫైన్ కడతామని, రైలు వెళ్లిపోతుందని వదిలిపెట్టమని ప్రాధేయపడ్డాడు.ఇంతలోనే రైలు బయలుదేరింది.రైలులో భార్య, బావమరిది, మరో ఇద్దరు స్నేహితులు ఉండగా, అతడు వేగంగా వెళ్లి రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి రైలు, ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Hyderabad Metro: మెట్రో విస్తరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం