119 మందితో భారత్ కు రెండో అమెరికా విమానం

119 మందితో భారత్ కు రెండో అమెరికా విమానం

అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వలసదారులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్.. అనుకున్నట్లుగానే అక్రమంగా నివాసం ఉంటున్న భారతీయుల్ని స్వదేశానికి పంపేస్తున్నారు. ఇప్పటికే 104 మంది వలసదారులతో కూడిన విమానాన్ని భారత్ లోని అమృత్ సర్ కు పంపిన ట్రంప్.. ఇవాళ మరో విమానం పంపిస్తున్నారు. ఇందులో 119 మంది వలసదారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో వివిధ రాష్ట్రాల వారు ఉన్నారు.
అమృత్ సర్ లో ల్యాండ్ కానున్నది
అమెరికాలో వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసల్ని గుర్తించే ఆపరేషన్ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా గుర్తించిన 119 మంది భారతీయుల్ని స్వదేశానికి పంపేశారు. ఇప్పుడు ఆ విమానం ఇవాళ అమృత్ సర్ లో ల్యాండ్ కాబోతోంది. అయితే తాజాగా అమెరికాలో ట్రంప్ ను కలిసిన మన ప్రధాని నరేంద్ర మోడీ వలసలపై చర్చలు జరిపారు. అయితే అక్రమ వలసల విషయంలో ట్రంప్ వైఖరితో మోదీ కూడా ఏకీభవించారు. దీంతో ట్రంప్ పని మరింత సులువైంది. భారత్ కు పంపాల్సిన వలసదారుల్ని వేగంగా గుర్తించి స్వదేశానికి పంపేయాలని ట్రంప్ ఆదేశాలు ఇచ్చేశారు.

Advertisements
119 మందితో భారత్ కు రెండో అమెరికా విమానం


కేంద్రంపై భగవంత్ సింగ్ మాన్ విమర్శలు
ఇవాళ అమృత్ సర్ కు రానున్న అమెరికా విమానంలో మొత్తం 119 మంది ఉండగా.. ఇందులో 67 మంది పంజాబ్ వారే ఉన్నారు. అలాగే హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్ కు చెందిన 8 మంది, యూపీకి చెందిన ముగ్గురు, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ కు చెందిన తలో ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ కు చెందిన చెరొకరు ఉన్నారు. దీంతో పంజాబ్ ఆత్మరక్షణలో పడింది. అమెరికా నుంచి వలసదారులతో వస్తున్న విమానాల్ని ఇలా అమృత్ సర్ లో దింపడం ద్వారా తమ రాష్ట్రం పేరు చెడగొడుతున్నారంటూ సీఎం భగవంత్ సింగ్ మాన్ కేంద్రంపై విమర్శలకు దిగారు.
పునరావాసం కలిపిస్తాము
అయితే తమ రాష్ట్రానికి చెందిన వలసదారుల్ని మాత్రం ఎలాంటి వివక్ష లేకుండా ఆహ్వానిస్తామని కూడా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. వారిని గౌరవంగా స్వర్ణదేవాలయానికి తీసుకెళ్లి అనంతరం పునరావాసం కల్పిస్తామన్నారు. అయితే తమ రాష్ట్రం పరువు తీసేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు దిగుతోందన్నారు. అమెరికా విమానాన్ని ఢిల్లీ లేదా అహ్మదాబాద్ లో ల్యాండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఈ వాదనను సమర్థిస్తోంది. అక్రమ వలసు జాతీయ సమస్య అని దీన్ని పంజాబ్ కు పరిమితం చేయొద్దని కేంద్రానికి వీరు సూచిస్తున్నారు.

Related Posts
ప్రపంచ మత్స్య దినోత్సవం!
fisher man

ప్రపంచ మత్స్య దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజు మనం మత్స్య వనరుల సమర్థవంతమైన వినియోగం, మత్స్య వేత్తల హక్కులు, మరియు Read more

ఉగ్రవాద నాయకుల భేటీ ఎందుకు?
ఉగ్రవాద నాయకుల భేటీ ఎందుకు?

పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లో ఉగ్రవాద నాయకుల సమావేశం జరిగింది ఈ భేటీలో జైష్-ఎ-మొహమ్మద్ (JeM) లష్కరే-ఎ-తోయిబా (LeT) అగ్ర కమాండర్లు అలాగే హమాస్ ప్రతినిధులు Read more

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పై గౌతమ్ అదానీ
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై గౌతమ్ అదానీ

పని-జీవిత సమతుల్యత గురించి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆలోచన "ఆసక్తికరమైనది" అని ఆర్పీజీ గ్రూప్ చైర్పర్సన్ హర్ష్ గోయెంకా అన్నారు. "పని-జీవిత సమతుల్యతపై గౌతమ్ Read more

Tahawwur Rana : ముంబయి పేలుళ్ల ఘటన.. రాణా పిటిషన్‌ను తిరస్కరించిన అమెరికా సుప్రీంకోర్టు
Mumbai blasts incident.. US Supreme Court rejects Rana's petition

Tahawwur Rana : ముంబయి పేలుళ్ల నిందితుడు తహవూర్‌ రాణాకు ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా Read more

×