విద్యాబుద్ధులు నేర్పించి, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన స్కూల్ ప్రిన్సిపాల్ తన వృత్తికే కళంకం తెచ్చాడు. స్కూలు పిల్లల్ని తన బిడ్డల్లా చూడాల్సిందిపోయి, కామంతో ఓ విద్యార్థిని గర్భవతిని చేశాడు. ఆ బాలికను బెదిరించి, తరచూ అత్యాచారాని (Crime)కి పాల్పడూతూ వచ్చాడు. చివరికి కటకటాలపాలు అయ్యాడు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కోనసీమ జిల్లా (Konaseema District) రాయవరం మండలం మాచవరం గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక ఆ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో, భయంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. ఇదే అదుపుగా భావించిన ప్రిన్సిపాల్ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ప్రిన్సిపాల్ పై కేసు నమోదు
ప్రస్తుతం ఆ బాలిక పదవ తరగతి చదువుతున్నది. అయితే గత మూడునెలలుగా పీరియడ్స్ రావడం లేదని తల్లిదండ్రులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షలు చేసిన వైద్యులు బాలిక గర్భవతి అని తేల్చారు. దీంతో అవాక్కైన తల్లిదండ్రులు బాలిక నుంచి అసలు విషయాన్ని రాబట్టారు. బాలిక తనపై ప్రిన్సిపాల్ (Principal) చేస్తున్న అత్యాచారం (Crime) గురించి వెల్లడించింది. కోపోద్రేకులైన తల్లిదండ్రులు తమకు న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించారు. ప్రిన్సిపాల్పై పోలీసులు కేసే నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తల్లిదండ్రులు జాగ్రత్త
ఆధునికకాలంలో తల్లిదండ్రులు ఇద్దరూ పనిచేస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి ఉండడంతో ఉదయమే తమ ఉద్యోగాల నిమిత్తం పరుగులు తీస్తుంటారు. తమ పిల్లలు ఏస్థితిలో ఉన్నారో గమనించే సమయం ఉండడం లేదు. వారితో గడిపేందుకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దీంతో పిల్లలు దారితప్పిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి. వారు ఎలాంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో కూడా గమనించకపోతే ఇలాంటి నష్టాల బారినపడాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత బీజీగా ఉంటున్నా మన బిడ్డల పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి.
Read hindi news: hindi.vaartha.com
Read also: Khammam: ఆశ్రమ పాఠశాలలో పరీక్ష రాస్తూ మృతి చెందిన బాలిక