IPL 2025: మ్యాచ్ ఓటమిపై స్పందించిన సంజు శాంసన్

IPL 2025: మ్యాచ్ ఓటమిపై స్పందించిన సంజు శాంసన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్ 58 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.బుధవారం జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 19.2 ఓవర్లలో 159కే ఆలౌట్ అయ్యింది. హెట్‌మయర్‌ (52 పరుగులు), శాంసన్‌ (41 పరుగులు), పరాగ్‌ (26 పరుగులు) మాత్రమే రాణించారు. జైస్వాల్ (6), నితీశ్‌ రాణా (1), ధ్రువ్ జురెల్ (5), శుభమ్‌ దూబె (1) విఫలమయ్యారు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 3, రషీద్‌ ఖాన్‌ 2, సాయి కిశోర్‌ 2, సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, కుల్వంత్‌ కెజ్రోలియా ఒక్కో వికెట్‌ పడగొట్టారు.అంతకుముందు బ్యాటింగ్​కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 217-6 పరుగుల భారీ స్కోరు చేసింది. సాయి సుదర్శన్ (82 పరుగులు), జోస్ బట్లర్ (36 పరుగులు), షారుక్ ఖాన్‌ (36 పరుగులు) రాణించగా, రాహుల్ తెవాతియా (24* పరుగులు) చివర్లో దూకుడుగా ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ 2, తుషార్ దేశ్‌పాండే 2, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. కాగా, తాజా గెలుపు గుజరాత్​కు నాలుగో విజయం కాగా, రాజస్థాన్​కు ఐదింట్లో మూడో ఓటమి.

Advertisements

కెప్టెన్ స్పందన

మ్యాచ్ అనంతరం తన ఓటమిపై స్పందించాడు కెప్టెన్ సంజు శాంసన్. అతడు మాట్లాడుతూ.. “బౌలింగ్‌లో మేము దాదాపు 15 నుంచి 20 పరుగులు ఎక్కువగా ఇచ్చేశాం. మేము మ్యాచును మా వైపునకు తిప్పే ప్రయత్నం చేసినప్పుడల్లా ప్రతిసారీ వికెట్లను కోల్పోయాం. నేను, హెట్మయర్‌ కలిసి బ్యాటింగ్ చేసినప్పుడు మ్యాచ్ మా అందుబాటులోనే ఉంది. కానీ నా వికెట్ పడ్డాకే గేమ్ మలుపు తిరిగిపోయింది. పిచ్‌ నుంచి కాస్త సహకారం లభించింది. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతులు చూస్తే అది స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా గిల్ వికెట్ తీసిన విధానం చూస్తే అర్థమవుతుంది. కానీ చివరి ఓవర్లలో మా బౌలింగ్ తీరు ఆశించిన స్థాయిలో లేదు. మేము దీనిపై చర్చించి సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటములు ఎదురైనప్పుడు ముందుగా బ్యాటింగ్ చేయాల్సిందా లేదా ఛేజ్ చేయాల్సిందా అన్నది కూడా ఆలోచిస్తాం. ఇది మంచి పిచ్. ఈ పరిస్థితులను గౌరవిస్తూ, ఛేదనలో గెలిచే సామర్థ్యం ఉన్న జట్టుగా మమ్మల్ని మేము మలచుకోవాలనుకుంటున్నాం,” అని శాంసన్ అన్నాడు.

 IPL 2025: మ్యాచ్ ఓటమిపై స్పందించిన సంజు శాంసన్

అడ్వైజరీ కమిటీ

అయితే ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్​కు మరో ఎదురుదెబ్బ తలిగింది. అతడికి ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్​లో స్లో ఓవర్ రేట్ కారణంగా శాంసన్​కు రూ.24 లక్షల ఫైన్ విధిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది.ఈ ఐపీఎల్ సీజన్‌లో పలువురు ఆటగాళ్లకు జరిమానా విధించారు. వివాదాస్పద రీతిలో సంబరాలు చేసుకున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌కు చెందిన దిగ్వేష్‌ రాఠీకి మూడుసార్లు జరిమానా విధించగా అదే సమయంలో రిషబ్ పంత్, ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మొదటి మూడు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన రియాన్ పరాగ్, గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మలకు సైతం జరిమానా విధించారు.

Read Also: Los Angles Olympics: 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌

Related Posts
PM Modi : పోప్ ఫ్రాన్సిస్ మృతిపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
PM Modi shocked by Pope Francis death

PM Modi : అమెరికాకు చెందిన పోప్ ఫ్రాన్సిస్ (88) ఈ రోజు మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్ని వాటికన్ సిటీ అధికారికంగా Read more

ఆపసోపాలు పడుతూ లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా
2nd t20

గెబెర్హా వేదికగా జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఉత్కంఠభరితంగా భారత్‌పై విజయాన్ని సాధించింది. తక్కువ స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ ఉత్కంఠతో సాగిన ఈ పోరులో చివరకు Read more

IMD: ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం : ఐఎండీ
Rainfall is higher than normal this time.. IMD

IMD : ఈ సారి భారత్‌లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం Read more

ఈ ఏడాది వర్షాలతో ఎంతమంది చనిపోయారంటే..
died due to this years rai 1

ఈ ఏడాది వర్షాకాలంలో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. ఈ వర్షాల కారణంగా 1492మంది Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×