हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Toll plaza revenue: రికార్డు స్థాయిలో టోల్ ప్లాజాల ఆదాయం

Shiva
Toll plaza revenue: రికార్డు స్థాయిలో టోల్ ప్లాజాల ఆదాయం

జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన టోల్(Toll plaza) ప్లాజాలు ప్రస్తుతం ఆర్థికపరమైన అంశాల్లో కీలకంగా మారాయి. గతంలో నగదును టోల్ ప్లాజాలో చెల్లించే సమయంలో ఆయా మొత్తాలు నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరేవి కావు. అనేక ప్రాంతాల్లో టోల్జాల నిర్వాహకులు వేర్వేరు ఆకౌంట్లు ఏర్పాటు చేసి వాటిలో నగదును జమ చేసేవారు. అయితే ఫాస్ట్యగ్ విధానాన్ని అమలుచేసిన తరువాత టోల్ ప్లాజాల(Toll plaza revenue ) వద్ద వాహనదారులు చెల్లించే మొత్తం నేరుగా ప్రభుత్వ ఖజానాకు నిధులు జమ అవుతున్నాయి. దీనితో ప్రతి ఏడాది టోల్జాల ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంటోంది. 2025 సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో సెప్టెంబరు వరకు టోల్ ఆదాయం ఏకంగా 16 శాతం వృద్ధితో 49,193 కోట్లకు చేరింది. వాహనాల రాకపోకలు గణనీయంగా పెరగడం, నిర్ణీత కాల వ్యవధిలో టోల్ రుసుములను సవరించడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలని ఐసీఆర్ అనలిటిక్స్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో టోల్ చెల్లించే వాహనాల సంఖ్య కూడా 12 శాతం పెరిగి 26,864 లక్షలకు చేరుకుంది. గతేడాది మొత్తం మీద ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లు 57,940 కోట్లుగా నమోదయ్యాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11 శాతం అధికం. వాహనాల సంఖ్య పరంగా చూస్తే, 2023లో 30.4 లక్షలుగా ఉన్న టోల్ లావాదేవీలు, 2024 నాటికి 32.5 లక్షలకు పెరిగాయి. వాహనాల సంఖ్య కంటే టోల్ ఆదాయం వేగంగా పెరగడానికి భారీ వాహనాల వాటా ఎక్కువగా ఉండటం, టోల్ ఛార్జీల పెంపు వంటి అంశాలు దోహదపడినట్లు ఐసీఆర్ విశ్లేషించింది.

Read Also: Rains: హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు

టోల్జాల్లో చెల్లింపుల విషయంలో పశ్చిమ, దక్షిణ భారతానిదే సింహభాగంగా ఉంటోంది. దేశ మొత్తం టోల్ ఆదాయంలో పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని కారిడార్ల వాటా సగానికి పైగా ఉండటం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ఏడాది 9 నెలల కాలంలో మొత్తం వసూళ్లలో పశ్చిమ భారతదేశం సుమారు 30 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాది 25 శాతంతో రెండో స్థానంలో, ఉత్తర భారతదేశం 23 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. తూర్పు, మధ్య భారతదేశం కలిపి

Toll plaza revenue

నాలుగో వంతు వాటాను కలిగి ఉన్నాయి. ప్రాంతాలను బట్టి మారుతున్న వాహనాల తీరు. పశ్చిమ, మధ్య, తూర్పు భారతదేశంలో టోల్(Toll plaza revenue) చెల్లించే వాహనాల్లో 50 శాతానికి పైగా వాణిజ్య వాహనాలే (సరుకు రవాణా) ఉంటున్నాయి. ముఖ్యంగా ఒడిశా, ఏపీలోని గనులు ఓడరేవుల కారిడార్లు, ఛత్తీస్గఢ్లోని ఖనిజ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల గుండా పారిశ్రామిక, లాజిస్టిక్స్ కార్య కలాపాలు మెరుగ్గా సాగడమే ఇందుకు కారణమని ఐసీఆర్ఎ అనలిటిక్స్ నాలెడ్జ్ సర్వీసెస్ హెడ్ మధుబని సేనుప్తా వివరించారు. దీనికి భిన్నంగా, ఉత్తర, దక్షిణ భారతదేశంలో ప్రయాణికుల వాహనాలదే ఆధిపత్యం ఇక్కడి టోల్ లావాదేవీలలో 65 నుంచి 30 శాతం కార్లు, జీవులే ఉంటున్నాయి. వ్యక్తిగత వాహనాల వినియోగం అధికంగా ఉండటం వల్ల ఈ ధోరణి కనిపిస్తోంది. కరోనా వచ్చిన తరువాత 2021 నుంచి కార్ల వినియోగం గణనీయంగా పెరిగింది. సురక్షిత ప్రయాణానికి కార్లు ఉత్తమమైనవని భావించిన మధ్య తరగతి కుటుంబాలు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నాయి. ఇటీవల జీఎస్టిని గణనీయంగా తగ్గించడంతో కార్ల ధరలు కొంత వరకు అందుబాటులోకి వచ్చాయి. దీనితో గత నెల రోజులుగా రికార్డు స్థాయిలో వాహనాలను డెలివరీ చేస్తున్నారు. సంవత్సర కాలంలో విక్రయించే వాహనాలను కేవలం 40 రోజుల వ్యవధిలో విక్రయించినట్లు డీలర్లు ప్రకటిస్తున్నారు.

Read Also: why is gold price rising: పగ్గాలు లేని పసిడి ధరలు

అదేవిధంగా రాజ్మార్గ యాత్ర యాప్ను తీసుకువచ్చి ప్రైవేటు కార్లకు వెసులుబాటు ఇచ్చారు. మూడు వేలు చెల్లించడం ద్వారా సం॥లో 200 టోలేట్లు గానీ, సం॥ కాలంగానీ వినియోగంలో ఉండే విధంగా రాయితీ కల్పించారు. దీనివల్ల ఒక్కొక్క టోల్ ప్లాజాలకు కేవలం 15 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

త్వరలో టోల్ ప్లాజా ల స్థానంలో జీపిఎస్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల వాహనాలు టోల్ ప్లాజా వద్ద నెమ్మదిగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. జీపిఎస్ విధానం వల్ల ఆటోమెటిక్ రుసుము చెల్లింపులు జరుగుతాయి. సిబ్బందిని కేవలం పది శాతం వరకు ఉపయోగించడంతో పాటు రోడ్డుకు అడ్డుగా భారీ ప్లాజాలు నిర్మించాల్సిన అవసరం ఉండదు.

డాక్టర్ గిరీష్ కుమార్ సంఘీ

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870