ప్రకృతిలో వస్తున్న మార్పులు, జనజీవనంలో తప్పిదాలు హైదరాబాద్ నగరానికి శాపంగా పరిణమించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల జనజీవనం స్థంభించిపోతోంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురియడంతో అనేక ప్రాంతాల చెరువులను తలపిస్తున్నాయి. సుమారు ఆరేడు దశాబ్దాల క్రితం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ వర్షం నీరు ప్రవహించడానికి వీలులేని పరిస్థితి నెలకొని ఉంది. హైదరాబాద్లో దాదాపు 1,295 కి.మీ.ల నీటి కాలువలు, ఉన్నాయి, వీటిలో 73 కి.మీ. సహజ కాలువలు, సైడ్ డ్రెయిన్లు 44 కి.మీ., కవర్డ్ డ్రెయిన్లు 860కి. మీ. ఓపెన్ డ్రెయిన్లు 316 కి.మీలు ఉన్నాయి. ఇవన్నీ కేవలం ఆరేడు సెంటీమీటర్ల వర్షపునీరు మాత్రమే ప్రవహించేలా చేయగలవు. అంతకు మించితే కాలువలు ఉప్పొంగి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతాయి. ఈ సంవత్సరంలో సుమారు జూలై నెలాఖరు నుంచి దాదాపు ప్రతిరోజూ వర్షం(rain)కురుస్తూనే ఉంది. ఇక సెప్టెంబరు నెలలో కుండపోత వర్షాలు మరీ ఎక్కువయ్యాయి. వీటిని సాంకేతికంగా క్లౌడ్ బరస్ట్ (మేఘ విస్పోటం)గా పేర్కొంటున్నారు. కేవలం రెండు మూడు గంటల వ్యవధిలో ఒకేసారి 15 నుంచి 25 సెంటీమీటర్ల వర్షం కురియడంతో నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వర్షాల కారణంగా నలుగురు నీటి వరదలో కొట్టుకుపోయి మృతి చెందారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లో వర్షప్రభావానికి వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి ఏకంగా ఎనభై కిలోమీటర్ల దూరంలో శవమై తేలడం ద్వారా వర్షాల ప్రభావం ఎంత అధికంగా ఉందో స్పష్టం అవుతోంది.
హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు
హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు పాటు కాలనీలు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పడ్డాయి. దీనికి అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను (Drainage system) అభివృద్ధి చేయకపోవడంతో సమస్యలు ఎదురౌతున్నాయి. ప్రధానంగా పూడికతీత పనులు సక్రమంగా జరగడం లేదు. నగరం మధ్యగా వెలుస్తున్న ఓపెన్ నాలాలు ఆక్రమణలకు గురికావడం కూడా ఒక ప్రధాన అవరోధంగా ఏర్పడింది. అక్రమ కట్టడాలను నిరోధించేందుకు ఏర్పడిన హైడ్రా రాజకీయ కోరల్లో చిక్కుకోవడంతో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. నగరం మధ్యలో నుంచి ప్రవహిస్తున్న మూసీనది, ఓపెన్ నాలాలు ఆక్రమణల వల్ల కుదించుకుపోయాయి. ఈ ప్రాంతం మీదుగా నీరు ప్రవహించే అవకాశం లేకుండా. పోయింది. సుమారు 15-20 సంవత్సరాల నుంచి ఆక్రమణలను తొలగించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ రాజకీయ వత్తిడిల కారణంగా పనులు ముందుకు సాగలేదు. హైడ్రాను ఏర్పాటు చేసిన తరువాత కొన్ని చెరువులను అభివృద్ధి చేయగలిగారు. గతంలో నగరంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే నీటి ముంపునకు గురయ్యేవి. ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. భారీ వర్షం కురిస్తే 70 శాతం కాలనీలు, ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. డ్రైనేజీలలో పూర్తి స్థాయిలో పూడికను తొలగించడమే కాకుండా దెబ్బతిన్న పైపులను తొలగించాల్సిన అవసరం ఉంది. బేగంపేట, పంజాగుట్ట, ఎంజె మార్కెట్, అంబర్పేట వంటి కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలను కొంత అభివృద్ధి చేశారు. అయితే కనీసం 400 కిలోమీటర్ల మేర డ్రైయిన్లను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా నిధుల కొరత వల్ల కార్యరూపం దాల్చడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2020 అక్టోబర్లో సంభవించిన ఆకస్మిక వరదల సమయంలో ముంపునకు గురైన ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ మొదటి దశలో రూ.858 కోట్ల వ్యయంతో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దీనికింద ప్రధాన డ్రెయిన్లను అభివృద్ధి చేయడం ద్వారా ముంపు సమస్యలకు చెక్ పెట్టాలని ప్రయత్నించారు. అయితే ఈ ప్రణాళికలు రికార్డులకే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయిలో అమలు చేయలేకపోయారు. హైదరాబాద్లో ప్రస్తుతం నీటి ముంపు సమస్యను నివారించాలంటే డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉంది.

జూబ్లీహిల్స్ నుంచి హుస్సేన్సాగర్
జూబ్లీహిల్స్ నుంచి హుస్సేన్సాగర్ వరకు, హుస్సేన్ సాగర్ నుంచి గాంధీనగర్, నల్లకుంట మీదుగా నగర శివార్లకు ప్రవహించే కెనాల్స్ ను చక్కదిద్దాలి. ముందుగా ఈ ప్రాంతంలో ఉన్న ఆక్రమణలను తొలగించాలి. తరువాత పూడికను పూర్తి స్థాయిలో తొలగించి, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా రిటైనింగ్ వాల్ను నిర్మించాలి. పరిసర ప్రాంత ప్రజలు చెత్తాచెదారాన్ని ఈ ప్రాంతంలో వేయకుండా ఫెన్సింగ్ నిర్మించి రక్షణ కల్పించాలి. కనీసం 2050 సంవత్సర వినియోగాన్ని, వర్షాల తీవ్రతను అంచనా వేసి అభివృద్ధి పూర్తి స్థాయిలో కార్యాచరణను
చేపట్టాల్సి ఉంటుంది.
Read also: hindi.vaartha.com
Read also: