हिन्दी | Epaper
హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Farmers Seed Crisis:విత్తనాల కోసం రైతన్న ఆగమాగం

Hema
Farmers Seed Crisis:విత్తనాల కోసం రైతన్న ఆగమాగం

Farmers Seed Crisis:రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే వ్యవసాయ పనులకు బదులు రైతులకు కష్టాల సీజన్ప్రా రంభమైనట్లుగా ఉంది.

సరైన ప్రణాళిక లేకపోవడం, అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పరిశీలన జరపకపోవడం వంటి అనేక కారణాలు రైతులకు శాపంగా మారుతున్నాయి.

ప్రతి సీజన్లో రొటీన్గా అవే సమస్యలు వెంటాడుతున్నాయి.

ప్రకృతి వైపరీత్యాల సమస్య ఒకటైతే అంతకు మించి
ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడం వల్ల కలిగే నష్టాలే అధికంగా ఉంటున్నాయి. సీజన్ (season) ప్రారంభమయ్యే సరికి రైతులు పొలాలను దుక్కిదున్ని పంటలు వేయడానికి భూమిని సిద్ధం చేసుకుంటారు.

తొలకరి ప్రవేశించడానికి ముందే మరికొన్ని పనులు చేసుకోవడంలో రైతులు నిమగ్నం అవుతారు. అందులో ప్రధానమైనది, ప్రాథమికమైనది విత్తనాల(seeds) సేకరణ.

విత్తనాలు
సిద్ధం చేసుకుంటే తొలకరి నాటి నుంచి రైతులు పొలం పనుల్లో నిమగ్నం అవుతారు. ఇది ప్రతి సంవత్సరం కొనసాగే ప్రక్రియ.

వేసవికాలం ముగుస్తుండగానే రైతులు పొలం పనులపై దృష్టి

సారిస్తారు.వేసవికాలం ముగుస్తుండగానే రైతులు పొలం పనులపై దృష్టి ప్రస్తుతం విత్తనాలు సేకరించి సిద్ధం చేసుకునే ప్రయత్నంలో రైతులు ఉన్నారు.

అయితే వారికి విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ఈ వైఫల్యం ఏ ఒక్క
సీజన్కో పరిమితం కాకుండా ప్రతిసారీ ఇదే సమస్య పునరావృతం అవుతూ ఉంటుంది. రైతులు విత్తనాల కోసం పడిగాపులుకాస్తున్నారు.

Farmers Seed Crisis

తెల్లవారుజామునే ఆగ్రో సంస్థల, దుకాణాల వద్దకు
చేరుకుని నిద్రాహారాలు మానుకుని విత్తనాల కోసం కళ్లలో ఒత్తులువేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే వారికి కావల్సిన మేరకు విత్తనాలు లభించడం లేదు.

ఆలస్యంగా వస్తే అవి కూడా
లభించడం లేదు. నాలుగు ఎకరాల రైతుకు ఏమేరకు విత్తనాలు అవసరమో దానికి సరిపడా విత్తనాలు అందిస్తే రైతులు పొలం పనుల్లో నిమగ్నం అవుతాడు.

అయితే రైతుకు ఎంత అవసరమో అందులో సగానికి కంటే తక్కువ విత్తనాలు ఇస్తున్నారు. దీనితో రైతులు ప్రతి రోజూ ఆగ్రో దుకాణాల చుట్టూ తిరుగుతూ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ప్రతి రైతుకు పట్టాదారు

పాసుపుస్తకాలు ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకుని ఆమేరకు విత్తనాలు అందిస్తే విత్తనాల కొరత సమస్య తీరిపోతుంది. ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ మంత్రిత్వశాఖపై ఆధిపత్యం
సాధించే ప్రజాప్రతినిధులు విత్తనాల కొరతే లేదని, సీజన్ కుసరిపడా విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించి సంతృప్తి చెందుతున్నారు.

అయితే ఈ సమీక్షలకు, ప్రకటనలకు,
అధికారులు రూపొందిస్తున్న నివేదిలకు వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. దిగుబడి గణనీయంగా తగ్గుముఖం పడుతుంది.

ఈసారి ఎప్పటిలాగే పత్తి, జీలుగు, జనుము, పచ్చిరొట్ట, వడ్ల విత్తనాలు అందడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి బోనస్ ప్రకటించడంతో ఎక్కువమంది రైతులు సన్నాల వైపు మొగ్గు చూపుతున్నారు.

5 నుంచి 7 వేల క్వింటాళ్ల సన్నాల వడ్లు అవసరం కాగా ఇప్పటి వరకు కేవలం ఆరు వందల క్వింటాళ్లు మాత్రమే రైతులకు అందాయి. దీనితో ప్రైవేటు వ్యక్తులపై రైతులు ఆధారపడాల్సి వస్తోంది.
ఈసారి సీజన్ అత్యధికంగా సన్నాలు సాగుచేసేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. హైదరాబాద్ శివారులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించగా ఏకంగా సుమారు మూడువేల మంది రైతులు హాజరయ్యారు.

వాస్తవానికి ప్రతి సంవత్సరం అందులో సగం మంది రైతులు కూడా హాజరయ్యే వారు కాదు, దాదాపు రెట్టింపు సంఖ్యలో రైతులు హాజరై సన్నాల రకం వడ్లు కావాలని వత్తిడి చేశారు.

రైతులు ముఖ్యంగా తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్), వరంగల్
సన్నాల కోసం డిమాండ్ చేశారు.

ఈసారి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎకరానికి రెండు ప్యాకెట్ల చొప్పున 1,26 కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే అందులో సగం కూడా సిద్ధం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

నకిలీ విత్తనాలు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి.

ఇదే సమయంలో నకిలీ విత్తనాలు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. కొడంగల్, సంగారెడ్డి, మహబూబ్నగర్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దీనితో రైతులు ఏ విత్తనాలు కొనుగోలు చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు. లక్షా 40 వేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేయాల్సి ఉండగా కేవలం 80 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

సుమారు లక్షా 25 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా అందులో సగం కూడా రైతులకు అందుబాటులో ఉంచలేకపోయారు.

రైతులకు కావాల్సిన విత్తనాలు కాకుండా వేర్వేరు రకాలు అందుబాటులో ఉంచుతున్నారు. దీనితో రైతులు వాటిని కొనుగోలు చేయకుండా వెనుదిరిగి వెళుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించని ప్రభుత్వం రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు ప్రచారం చేస్తోంది.

Farmers Seed Crisis

విత్తనాలు సమస్య తీరిన తరువాత ఎరువులు, క్రిమిసంహారక మందుల కోసం మళ్లీ రైతులు రోడ్డెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితి నెలకొంటుంది.

ప్రతి సీజన్కు కనీసం నెల రోజులు ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసి ఆమేరకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు సిద్ధం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది.

రైతుల అవసరాలకు అనుగుణంగా మేలైన విత్తనాలు అందిస్తేరైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఈసారి వర్షాకాల సీజన్
కొంతముందుగానే వచ్చింది. దీనితో పంటలు త్వరగాసాగు చేసి దిగుబడి రాబట్టాలని
రైతులు ఆశతో ఉన్నారు.

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/trump-criticism-on-india-policies/sanghibavam/525605/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870