హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే నూతన జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ మంగళవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించారు. మాథూర్ 1988 బ్యాచ్ ఐ.ఆర్.ఎస్.ఎస్.ఈ(ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నలింగ్ ఇంజనీర్) కేడర్కు చెందినవారు. సందీప్ మాథుర్ విశాఖపట్నం లో ప్రధాన కార్యాలయం కలిగిన నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ నియమి తులయ్యే ముందు, రైల్వే మంత్రిత్వ శాఖలోని రైల్వే బోర్డులో ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (Executive Director), సిగ్నలింగ్గా విధులను నిర్వర్తించేవారు. ఉద్యోగప్రస్థానాన్ని ఉత్తర రైల్వేలోని అలహాబాద్ డివిజన్ (ఇప్పుడు ఉత్తర మధ్య రైల్వేలోని ప్రయాగా రాజ్ డివిజన్)లో అసిస్టెంట్ సిగ్నల్,టెలికాం ఇంజనీర్గా ప్రారంభించారు.

అధికారులను ఉద్దేశించి
కాగా పదవీభాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్ (Neeraj Agarwal), దక్షిణ మధ్య రైల్వే వివిధ శాఖలకు చెందిన ప్రధాన అధిపతులు, ఇతర సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరుడివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు. జనరల్ మేనేజర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రైల్వే కార్యకలాపాల భద్రత ఎల్లప్పుడూ ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి (special focus) పెట్టాలని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు. గడచిన కొన్ని సంవత్సరాల కాలంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ సాధించిన ప్రగతిని, సిబ్బంది అంకితభావాన్ని ప్రశంసించారు.
Read Also: Himachal Pradesh:దేశవ్యాప్తంగా విజృంభించిన నైరుతి