Samantha ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు పొందిన సామ్

Samantha:ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు పొందిన సామ్

Samantha:ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు పొందిన సామ్ గత రెండేళ్లుగా సినిమాల్లో కనిపించకపోయినా ఓటీటీ ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉంది సమంత.థియేటర్లలో విరామం తీసుకున్నా, ఆమె క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా సమంత ఓటీటీలో ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది.’సిటాడెల్: హానీ-బన్నీ’ సిరీస్‌లో సమంత అద్భుత నటన ప్రదర్శించిందని గుర్తిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థ ఈ పురస్కారాన్ని అందజేసింది.

Samantha ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు పొందిన సామ్
Samantha ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు పొందిన సామ్

రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సమంతకు జోడీగా వరుణ్ ధావన్ నటించాడు.అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ‘సిటాడెల్’ సిరీస్ భారీ వ్యూస్‌ను రాబట్టి, మంచి విజయాన్ని సాధించింది.ఈ అవార్డు అందుకోవడంపై సమంత ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ఈ సిరీస్‌ను పూర్తి చేయడమే నాకు నిజమైన అవార్డు.ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాను.నన్ను నమ్మిన, నాకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను” అని చెప్పింది.తన కో-యాక్టర్ వరుణ్ ధావన్, దర్శకులు రాజ్ అండ్ డీకేకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన సమంత, “ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి వారు ఎంతో సహాయం చేశారు.

Samantha ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు పొందిన సామ్
Samantha ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు పొందిన సామ్

నాకు అవసరమైన మద్దతును అందించి, ప్రతి అడుగునా నన్ను ఉత్సాహపరిచారు” అని వెల్లడించింది.ఆమె మాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ అవార్డు వేడుకకు సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రముఖ డిజైనర్ క్రేషా బజాజ్ రూపొందించిన లావెండర్ కలర్ శారీలో సమంత అదిరిపోయే అందాన్ని ప్రదర్శించింది.సాంప్రదాయ శారీకే ఆధునిక స్పర్శను జోడించి మరోసారి ఫ్యాషన్ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. స్మోకీ కళ్ల మేకప్, లైట్ పింక్ లిప్‌స్టిక్, మెరిసే హైలైటర్‌తో ఆమె లుక్ మరింత ప్రత్యేకంగా మారింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సమంత ప్రొఫెషనల్‌గా తిరిగి ఫుల్ ఫాంలోకి వస్తోంది. ‘సిటాడెల్’ తర్వాత మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌తో అలరించేందుకు రెడీ అవుతోంది. ఆమె ఫ్యాన్స్ ఈ సారి కూడా వెండితెరపై మళ్లీ తన మ్యాజిక్ చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Posts
నేను బతకడం కష్టమే అన్నారు..సోనాలి బింద్రే
Sonali Bendre

సోనాలి బింద్రే ఇటీవల తన జీవితంలో జరిగిన ఓ కీలకమైన ఘట్టం గురించి తన అభిమానులతో భావోద్వేగంగా, సరళంగా మాట్లాడారు. ఆ కష్టకాలంలో ఉన్న అనుభవాలను పంచుకుంటూ Read more

సోషల్ మీడియాలో వైరల్ గా అనసూయ వ్యాఖ్యలు!
anasuya bharadwaj

నటి అనసూయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్త్రీ, పురుషుల మధ్య సంబంధం గురించి తన అభిప్రాయాలను పంచుకుంది, "కామం సహజమైనది" అని మరియు ఆహారం, దుస్తులు మరియు Read more

ఇప్పటికి సమంతతో కాంటాక్ట్ ఉన్న ఏకైక టాలీవుడ్ హీరో ,
samantha ruth prabhu

సమంత ఈ పేరు టాలీవుడ్‌లో ఎప్పుడూ హిట్. ఏం మాయ చేసావే సినిమాలో ఆమె మొదటిసారి కనిపించినప్పుడు, కుర్రకారులో ఎలాంటి సందడి ఏర్పడిందో మాటల్లో చెప్పలేం. సినిమాకు Read more

 తమిళ హీరో విజయ్ కి కంగ్రాట్స్ చెప్పిన పవన్ కల్యాణ్
vijay pawan kalyan

తమిళ సినీ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అతను గతంలోనే తన రాజకీయ లక్ష్యాలను ప్రకటించినా, ఇటీవల విజయ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *