సోనాలి బింద్రే ఇటీవల తన జీవితంలో జరిగిన ఓ కీలకమైన ఘట్టం గురించి తన అభిమానులతో భావోద్వేగంగా, సరళంగా మాట్లాడారు. ఆ కష్టకాలంలో ఉన్న అనుభవాలను పంచుకుంటూ ఆమె తన ప్రయాణాన్ని వివరించారు.“నేను ఒక రియాలిటీ షోలో పాల్గొంటున్నప్పుడు నాకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి,” అని సోనాలి తన అనుభవాన్ని వివరించారు.“ప్రతీ వారం షూటింగ్ చేసుకుంటూ ఉండేదాం. ఓ రోజు నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళిపోయాను.అప్పుడు నా ఆరోగ్య పరిస్థితి నిజంగా చాలా గంభీరమైనది అని తెలుస్తుంది.”మొదట, ఈ వ్యాధి మొదటి దశలో ఉందని భావించినా,మరుసటి రోజు ఇది చాలా విస్తృతంగా వ్యాపించిందని తెలుసుకున్నారు. “ఇది మొదటి దశలో ఉన్నప్పటికీ, తర్వాత నా శరీరంలో ఈ క్యాన్సర్ కణాలు అన్ని భాగాల్లో వ్యాపించాయని తెలుస్తుంది,” అని ఆమె చెప్పింది.

ఈ విషయం తెలుసుకున్న భర్త,డాక్టర్,మరియు ఆమె కుటుంబం అందరూ షాక్ అయ్యారు. “అప్పుడు డాక్టర్లు నాకు చెప్పిన విషయమేమిటంటే, నేను బతికే అవకాశం కేవలం 30 శాతమే ఉందని చెప్పారు.ఇది వింటే మనస్సు చలించిపోతోంది. నా కుటుంబం కూడా చాలా ఆందోళన చెందింది,” అని సోనాలి వెల్లడించింది.ఆ క్షణాలలో ఆమె కుటుంబం ఎంత గంభీరంగా బాధపడిందో సోనాలి వివరించారు. కానీ అటువంటి కష్టకాలంలో కూడా ఆమె ధైర్యంతో పోరాడి మరొక ఉదాహరణని ఇచ్చారు. ఈ అనుభవం ఆమెకు ఆరోగ్యంపై అవగాహన పెంచేలా చేసింది. ఆరోగ్య పరీక్షలు, త్వరగా గుర్తించడం ఎంత కీలకమో ఆమె మాట్లాడారు. ఆమె జీవితం ఇప్పుడు చాలా మందికి ప్రేరణగా మారింది. తన ధైర్యం, పోరాటం అనేకరికి ఒక మైలు రాయిగా నిలిచింది.