हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Salman Khan : విడాకులు, భరణంపై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Divya Vani M
Salman Khan : విడాకులు, భరణంపై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ తన బృందంతో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ (‘The Great Indian Kapil Show’) కొత్త సీజన్‌కు శ్రీకారం చుట్టారు. ఈసారి షోలో ఓ స్పెషల్ ఆకర్షణగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ శాశ్వత అతిథిగా తిరిగి వచ్చారు. మొదటి ఎపిసోడ్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) పాల్గొనడం విశేషం.తాజాగా ఈ షోకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్ ‘బీయింగ్ హ్యూమన్’ టీషర్ట్‌లో హాజరై, చాలా స్పష్టంగా కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా విడాకులు, సంబంధాల గురించి చెప్పిన మాటలు అభిమానుల హృదయాలను తాకాయి.

ఇప్పటి తరం సహనం లేక విడాకుల పాలవుతుంది – సల్మాన్ వ్యాఖ్య

సల్మాన్ మాట్లాడుతూ, ఒక్కప్పుడు భార్యాభర్తలు ఒకరిపై ఒకరు త్యాగాలు చేసుకునేవారు. చిన్నచిన్న ఇబ్బందులు ఎదురైనా బరించేవారు. కానీ ఇప్పుడు ఓ చిన్న గొడవకే విడిపోతున్నారు. రాత్రి గురక పెడుతున్నాడన్నా, కాలు తాకిందన్నా విడాకులేమిటి? విడాకుల తర్వాత సగం డబ్బులు కూడా తీసుకెళ్తున్నారు, అన్నారు. ఈ మాటలు వినగానే కపిల్ శర్మ, అర్చనా పూరన్ సింగ్, సిద్ధూ అన్నీ హాస్యపు హడావిడిలో నెగిలిపోయారు.

సోషల్ మీడియా మీద స్పందన – ఫ్యాన్స్ ఫిదా

ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు బోలెడు కామెంట్లు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఎప్పుడూ నిజాలు మాట్లాడతారు, ఇలాంటి విషయాలు చెప్పడంలో ఆయన్నే మించినవాడు లేడు, అని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా, ఆయన మాటల్లో అనుభవం కనబడుతోంది, అంటూ నెటిజన్లు తమ మద్దతు తెలిపారు.ఈ ఎపిసోడ్ టీజర్‌తోనే షోపై అంచనాలు పెరిగిపోయాయి. వినోదం, నిజాయితీ, స్టార్ పవర్ – అన్నీ కలిపి ప్రేక్షకులను ఓ రోలర్‌కోస్టర్ ప్రయాణంలోకి తీసుకెళ్తున్నాడు కపిల్ శర్మ. సల్మాన్ వ్యాఖ్యలు మాత్రమే కాకుండా, షోలో కనిపించే సహజ హాస్యం కూడా వైరల్ కావడం విశేషం.

Read Also : Israel : తొమ్మిది మంది ఇరానీ అణు శాస్త్రవేత్తల హతం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870