Sabarimala temple to be opened today

నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

తిరువనంతపురం: నేటి నుంచి శబరిమల ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆలయాన్ని మూసివేసిన పూజారులు నేడు తెరవనున్నారు. మకర విళక్కు పూజల కోసం సాయంత్రం ఐదు గంటలకు శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని ట్రావెన్స్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుంచే సంప్రదాయ బద్ధంగా పూజలు ప్రారంభమవుతాయి. ఈరోజు నుంచి తిరిగి శబరిమల ఆలయం తెరుచుకోనుండటంతో జ్యోతి దర్శనానికి మాలలు వేసుకునే అయ్యప్పలతో పాటు సాధారణ భక్తులు కూడా శబరిమలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

అదే సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆలయ అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల రికార్డు స్థాయిలో భక్తులు శబరిమలకు చేరుకున్నారు. లక్షల సంఖ్యలో చేరుకున్నా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. మహిళ భక్తులకు కూడా ప్రత్యేక గదులను ఏర్పాటు చేసిన బోర్డు మళ్లీ రద్దీ పెరిగే అవకాశముండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే రావాలని అధికారులు తెలిపారు.

మండల పూజ అనంతరం డిసెంబర్‌ 26న అంటే గత గురువారం ఆలయాన్ని మూసివేశారు. 41 రోజులపాటు సాగిన పూజల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాగా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజలు నవంబర్ 16న ప్రారంభమయ్యాయి. దీంతో తమిళనాడుతో పాటు పలు ప్రాంతాల నుంచి పలువురు భక్తులు శబరిమలకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. మండల పూజల సందర్భంగా శబరిమలలో మొత్తం 32 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో మకరవిళక్కు పూజల కోసం శబరిమల ఆలయం ఈరోజు తెరుచుకోనుంది. జనవరి 14న మకరవిళక్కు పూజ, మకరజ్యోతి దర్శనం నిర్వహించనున్నారు.

Related Posts
సన్నీ లియోన్ పేరుతో ప్రభుత్వ లబ్ది
Sunny Leone

ప్రముఖ నటి సన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నెలనెలా రూ.వెయ్యి అందిస్తోంది. వివాహిత మహిళల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో Read more

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు
Dil Raju is the Chairman of

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC)కు నూతన చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు Read more

ఇండియా , యుకె మరియు యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా
BAFTA reveals nominees for Breakthrough 2024 across India UK and USA

న్యూఢిల్లీ: నెట్‌ఫ్లిక్స్ మద్దతుతో బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా), ఈ రోజు చలనచిత్రం, టెలివిజన్ మరియు గేమ్‌ల పరిశ్రమల నుండి తమ Read more

భారత్‌పై ట్రంప్ ప్రభావం ఎంత?
ట్రంప్ ఆర్థిక వ్యూహం – వాణిజ్యంపై ప్రభావం

ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఆ దేశ విధానాలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రపంచ స్థాయిలో చాలా విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుంది. Read more