हिन्दी | Epaper
టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Russia: యుద్ధంతో కుప్పకూలుతున్న రష్యా అర్థిక వ్యవస్థ

Vanipushpa
Russia: యుద్ధంతో కుప్పకూలుతున్న రష్యా అర్థిక వ్యవస్థ

రష్యా ఆర్థిక వ్యవస్థ సంక్షోభపు అంచుల్లోకి చేరుకుంది. 2022 నుండి ఉక్రెయిన్‌(Ukraine)పై సైనిక దాడితో విరుచుకుపడుతోంది రష్యా(Russia). ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితుల్లో ఉందని దేశ ఆర్థిక మంత్రి మాగ్జిమ్ రెషెట్నికోవ్ తెలిపారు. సెయింట్ పీటర్స్‌బర్గ్(Saint Peter burg) అంతర్జాతీయ ఆర్థిక వేదికలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు. దీనిపై రష్యా త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని తర్వాత తిరిగి లేవడం కష్టమని హెచ్చరించారు. మహమ్మారి నుండి రష్యన్ ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు అడుగులు వేస్తూనే ఉంది. గత మూడు సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీనికి తోడు ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం కావడం మొదలైంది. ఉక్రెయిన్‌(Ukraine)తో యుద్ధం వల్ల ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. ఈ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉండేదుకు వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. అయినా సరే ద్రవ్యోల్బణం 2024లో 9.5 శాతం ఉండగా.. 2025లో 9.8 శాతంగా ఉంది.

Russia: యుద్ధంతో కుప్పకూలుతున్న రష్యా అర్థిక వ్యవస్థ
Russia: యుద్ధంతో కుప్పకూలుతున్న రష్యా అర్థిక వ్యవస్థ

2025 మొదటి త్రైమాసికంలో రష్యా ఆర్థిక వృద్ధి 1.4%కి పడిపోయింది
కాగా 2022 తర్వాత ఈ నెలలో రష్యా వడ్డీ రేట్లను తగ్గించింది. దీని వల్ల రుణం తీసుకునే ఖర్చు 21 శాతం నుండి 20 శాతానికి తగ్గింది. అయినప్పటికీ వ్యాపారవేత్తలు రుణాలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు.రష్యాలో అధిక వడ్డీ రేట్లు దేశంలో కొత్త పెట్టుబడులను నిరోధిస్తున్నాయని తెలుస్తోంది. తద్వారా దేశ ఆర్థిక వృద్ధి మందగిస్తోందని వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. 2025 మొదటి త్రైమాసికంలో రష్యా ఆర్థిక వృద్ధి 1.4%కి పడిపోయింది. ఇది 2024లో 4.5% ఉండగా.. 2021లో 4.3% నుండి తగ్గింది. ఉక్రెయిన్ యుద్ధంపై విధించిన పాశ్చాత్య ఆంక్షల కారణంగా ఈ పతనం ఏర్పడింది.

ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా..

ఇది అధిక వ్యయంతో పాటుగా రష్యా ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. 2025 నాటికి రష్యా రక్షణ వ్యయం దాని GDPలో 8% మించిపోతుందని అంచనా వేశారు. ఇది సోవియట్ కాలం తర్వాత అత్యధిక స్థాయి అని గణాంకాలు చెబుతున్నాయి ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా.. 2023లో రష్యా తన రక్షణ వ్యయాన్ని భారీగా పెంచింది. 2025లో రష్యన్ పార్లమెంట్ రూ. 10 లక్షల 67 వేల కోట్ల (126 బిలియన్ డాలర్లు) రక్షణ బడ్జెట్‌ను ఆమోదించింది.
మాంద్యం అంచున రష్యా
ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. 2022 ఉక్రెయిన్ దాడి తర్వాత రష్యన్ సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన 300 బిలియన్ల డాలర్ల ఆస్తులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలు స్తంభింపజేశాయి. రష్యా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఎల్విరా నబియుల్లినా మాట్లాడుతూ.. ఇక్కడి వ్యాపార పరిస్థితులు చూస్తుంటే.. మనం ఇప్పటికే మాంద్యం అంచున ఉన్నామని సూచిస్తున్నాయని అన్నారు. ఇక రష్యాలో అతిపెద్ద బ్యాంకు స్బేర్‌బ్యాంక్ మొదటి డిప్యూటీ సీఈఓ అలెగ్జాండర్ వేద్యాఖిన్ ఈ వారం రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యా యొక్క కఠినమైన ద్రవ్య విధానం ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ప్రమాదాన్ని కలిగిస్తుందన్నారు.

యుద్ధం కారణంగా పౌరులు దేశం విడిచివెళ్లిపోతున్నారు

ఆ విషయంలో కాళ్లబేరానికి వచ్చినట్లేనా.. దేశంలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, ఇతర కూరగాయలు, గుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. యుద్ధం కారణంగా చాలా మంది పౌరులు దేశం విడిచివెళ్లిపోతున్నారు. దీని వల్ల కార్మికుల కొరత ఏర్పడింది. మెరుగైన అవకాశాల కోసం ప్రజలు కూడా వలసపోతున్నారు. ఇది ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి కారణంగా 2024 వరకు 45 కి పైగా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థ చమురు, గ్యాస్ ఎగుమతిపై ఎక్కువగా ఆధారపడి ఉన్నందున ఎగుమతుల నుండి వచ్చే ఆదాయం పలు దేశాల ఆంక్షలతో భారీగా తగ్గింది.

Read Also: Donald Trump : ఇరాన్‌పై రెండు వారాల్లో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం: వైట్‌హౌస్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

📢 For Advertisement Booking: 98481 12870