हिन्दी | Epaper

School Fee : ‘వామ్మో.. నర్సరీకి రూ.50వేల ఫీజు’.. ఓ తండ్రి ఆవేదన

Sudheer
School Fee : ‘వామ్మో.. నర్సరీకి రూ.50వేల ఫీజు’.. ఓ తండ్రి ఆవేదన

హైదరాబాద్‌(Hyderabad)లో ప్రైవేట్ పాఠశాలలు ఆకాశాన్ని తాకే ఫీజుల(School Fee)తో తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఓ తండ్రి చేసిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన బిడ్డను నర్సరీ క్లాస్‌లో చేర్పించేందుకు వెళ్లగా, స్కూల్ యాజమాన్యం ఏకంగా రూ.50వేలకుపైగా ఫీజు చెప్పిందని పేర్కొన్నారు. చిన్నారుల కోసం బుక్స్, యూనిఫాంలు, యాక్టివిటీల పేరుతో వేర్వేరు అంశాలపై పెద్ద మొత్తాన్ని వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నారులపై బుక్‌ బరువు

నర్సరీ విద్యార్థులకు కూడా రూ.4,200 విలువ చేసే పుస్తకాలు అవసరమా అని తండ్రి ప్రశ్నించారు. ఆ వయస్సులో పిల్లలు ఆల్ఫాబెట్లు నేర్చుకునే స్థాయిలో ఉంటారు. ఇంత భారీ ఖర్చు ఎందుకో తల్లిదండ్రులకు అంతుబట్టడంలేదని వ్యాఖ్యానించారు. పుస్తకాలు, స్టేషన్‌రీలు స్కూల్‌లోనే కొనాల్సిందేనని, బయట కొనడం అనుమతించరని కొన్ని పాఠశాలలు డిక్టేట్ చేస్తున్నాయని పలువురు తెలిపారు.

అధికారుల జోక్యం అవసరం

ఈ అంశంపై నెటిజన్లు విస్తృతంగా స్పందిస్తున్నారు. “ఇది ఎడ్యుకేషన్ లేకుండా ఒక కమర్షియల్ మిషన్‌గా మారింది” అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. చదువుకు గౌరవం తగ్గి వ్యాపారంగా మారిన పాఠశాలలపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఫీజుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలు ప్రభావవంతంగా పనిచేయాలన్న ఆశతో తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.

Read Also : Air India Plane Crash : విమానం కూలడంపై TATA గ్రూప్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

📢 For Advertisement Booking: 98481 12870