IPL 2025: రోహిత్ సిక్సర్ తో బాదుడు..

IPL 2025: రోహిత్ సిక్సర్ తో బాదుడు..

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ఎట్టకేలకు బోణి కొట్టింది. కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ తమ వరుస ఓటములకు పుల్ స్టాప్ పెట్టింది. సోమవారం రాత్రి వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ గెలుపు పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్‌ను పదో స్థానంలో నుంచి ఆరోస్థానానికి తీసుకెళ్లింది.

వాంఖెడే స్టేడియం

సోమవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగింది కోల్‌కత నైట్ రైడర్స్. అధ్వాన్నపు ఆటతీరును ప్రదర్శించింది. ముంబై ఇండియన్స్ బౌలర్ల పరాక్రమం ముందు తలవంచింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లల్లో 116 పరుగులకు కుప్పకూలింది.కోల్‌కత నైట్ రైడర్స్ ఇన్నింగ్‌లో 26 పరుగులు చేసిన అంగ్‌క్రిష్ రఘువంశీ ఒక్కడే టాప్ స్కోరర్ అంటే ఆ జట్టు బ్యాటర్లు ఎంత చెత్తగా ఆడారో అర్థం చేసుకోవచ్చు.క్వింటన్ డికాక్- 1, సునీల్ నరైన్- 0, అజింక్య రహానె- 11, వెంకటేష్ అయ్యర్- 3, రింకూ సింగ్- 17, మనీష్ పాండే- 19, ఆండ్రీ రస్సెల్- 5, రమణ్ దీప్ సింగ్- 22, హర్షిత్ రాణా- 4, స్పెన్సర్ జాన్సన్- 1 పరుగు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. ఈ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చివేసింది. 12.5 ఓవర్లల్లో 121 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఫామ్‌లో లేని ఓపెనర్ రోహిత్ శర్మ 13, విల్ జాక్స్- 16 పరుగులకే అవుట్ అయ్యారు. మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్ 62, సూర్యకుమార్ యాదవ్ 9 బంతుల్లో 27 పరుగులతో అదరగొట్టారు.

డెబ్యూట్ బౌలర్

ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో చెలరేగాడు డెబ్యూట్ బౌలర్ అశ్విని కుమార్. మూడు ఓవర్లల్లో 24 పరుగులు ఇచ్చి అజింక్య రహానె, రింకూ సింగ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్ వికెట్లను నేలకూల్చాడు. ఇదే అతనికి తొలి ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ కూడా. అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.

119840061

ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మ విఫలం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తక్కువ స్కోరే ఉన్నప్పటికీ కుదురుగా ఆడలేకపోయాడు. ఇన్నింగ్ మొత్తం మీద 12 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో నమోదైంది ఒకే ఒక్క సిక్సర్. వికెట్లకు కాస్త దూరంగా ఆండ్రీ రస్సెల్ వేసిన ఫ్లాట్ బ్యాట్‌లో షాట్ ఆడాడు రోహిత్. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి ఎగిరిన బంతిని మిడాఫ్‌లో సులువగా అందుకున్నాడు హర్షిత్ రాణా. 46 పరుగుల వద్ద రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్. ఛేదించాల్సిన స్కోర్ భారీగా లేకపోయినప్పటికీ- కుదురుగా ఆడివుంటే కనీసం అతని బ్యాటింగ్ ట్రాక్‌లో పడి ఉండేది. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు చేసిన పరుగులు 21. చెన్నై సూపర్ కింగ్స్‌పై చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. రెండో మ్యాచ్‌లో ఎనిమిది పరుగులకే వెనుదిరిగాడు. ఇప్పుడు 13 పరుగులకే అవుట్ అయ్యాడు. ఒత్తిడి వల్లే అతను స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడనే అంచనాలు ఉన్నాయి.

Related Posts
కాంగ్రెస్ పార్టీవీ చీప్ పాలిటిక్స్ – బీజేపీ
bjp fire on congress

కాంగ్రెస్ పార్టీ చీప్ పాలిటిక్స్ చేస్తుందని బీజేపీ మండిపడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకార్థం స్థలాన్ని కేటాయించలేదంటూ కాంగ్రెస్ చేసిన తీరు సిగ్గుచేటుగా అభివర్ణించింది. బీజేపీ Read more

డ్రైవరున్ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు ఎందుకంటే !
Former CM's daughter hits d

అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్లా కుమార్ మహంత కూతురు ప్రజోయిత మహంత ఓ సంఘటన తో వార్తల్లో నిలిచారు. ఆమె తన వ్యక్తిగత డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన Read more

భారత్ ఇంగ్లాండ్ టీ20 మొదటి మ్యాచ్ కు సిద్ధం
భారత్ ఇంగ్లాండ్ టీ20 మొదటి మ్యాచ్ కు సిద్ధం

భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు కోల్‌కతాలో మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టును సమతూకంగా Read more

ముంబై దాడులు: రాణా అప్పగింతకు US సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
mumbai attack

2008 ముంబై దాడుల కేసులో ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను భారతదేశానికి అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాణా అప్పగింతపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *