నితిన్ – వెంకీ కలిసి చేసిన సినిమా ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’మూవీలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని తెలియడంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది.నితిన్ హిట్టు చాలా కాలమే అయ్యింది. చివరిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ మూవీ హిట్. ఆ తర్వాత నితిన్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్‌లో ఆడలేదు.రాబిన్‌హుడ్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? కథ, నటీనటుల ప్రదర్శన, సాంకేతికత ఎలా ఉందో చూద్దాం.
కథ
రామ్(నితిన్) చిన్నతనంలోనే అనాధాశ్రమంలో పెరిగిన అనాథ. తనని శరణాలయంలో వదిలేసిన వ్యక్తి ఎవరో తెలియదు. ఆ ఆశ్రమానికి ప్రభుత్వం, ధనికుల నుంచి ఎటువంటి సహాయం రాదు. పబ్లిసిటీ కోసం అనాధాశ్రమాన్ని ఉపయోగించేవాళ్లు ఉన్నారు కానీ, సహాయం చేసేవారు లేరు. ఈ నేపథ్యంలో రామ్ అనాధ పిల్లల కోసం ‘రాబిన్‌హుడ్’ అవతారమెత్తుతాడు. ధనికుల వద్ద నుంచి దోచి, పేదలకు సహాయం చేయడం మొదలుపెడతాడు.అయితే పోలీసులకు రాబిన్‌హుడ్ గురించి సమాచారం లభిస్తుంది. అతడ్ని పట్టుకోవడానికి ‘వైల్డ్‌డాగ్’ అనే పేరుగల పవర్‌ఫుల్ ఆఫీసర్‌ను ప్రభుత్వం నియమిస్తుంది. మరి ఆ ఆఫీసర్ రాబిన్‌హుడ్‌ని పట్టుకున్నాడా? రామ్‌కి ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆయనని అనాధాశ్రమంలో వదిలేసిన పెద్దాయన ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం మిగతా కథ.
విశ్లేషణ
ఈ సినిమా సాధారణ కథకి వేరే యాంగిల్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సమాజంలోని తారతమ్యాలను తొలగించాలని, పేదలు–ధనికుల మధ్య సమతుల్యత రావాలని హీరో ఆశించడం కొత్త కానప్పటికీ, సినిమాను ఆసక్తికరంగా నడిపించారు.ప్రథమార్థం హాస్యంతో, యాక్షన్‌తో నడుస్తుంది,ద్వితీయార్థంలో కథ కాస్త సీరియస్ అవుతుంది,కథలో లాజిక్ మిస్ అయినా, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ బాగుంది.

నటీనటులు
నితిన్ మరోసారి తన మాస్ అవతారాన్ని చూపించాడు. యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి.శ్రీలీల గ్లామర్‌తో ఆకట్టుకుంది. హాస్యభరితమైన పాత్రలో అలరించింది.రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ బాగుంది.విలన్ పాత్ర కొత్త నటుడు పోషించినప్పటికీ, కథలో ఒదిగిపోయాడు.కేతిక శర్మ చేసిన ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ వివాదాస్పదమైంది. ఈ సాంగ్‌ని తొలగించాల్సిందేనని తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ డిమాండ్ చేసిందిడైలాగులు బాగా రాసుకున్నారు. యాక్షన్ సీన్స్ కూడా బావున్నాయి. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం పర్లదు అనిపించింది. చూడ్డానికీ వినడానికీ రెండు పాటలు బాగున్నాయి..
సాంకేతికత
ఈ సినిమాలో క్లైమాక్స్ విషయంలో కూడా డైరెక్టర్ కేర్ తీసుకున్నాడు. మొత్తానికి ‘రాబిన్‌హుడ్’ నితిన్‌తో పాటు శ్రీలీలకి కమ్‌బ్యాక్ సినిమానే. ఓవరాల్‌గా నితిన్ ‘రాబిన్‌హుడ్’ మూవీ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ ఇష్టపడే వారికి కచ్చితంగా నచ్చుతుంది.