Yuzvendra Chahal: చాహల్ అద్భుత ప్రదర్శనపై స్పందించిన ఆర్ జే మహ్ వశ్

Yuzvendra Chahal: చాహల్ అద్భుత ప్రదర్శనపై స్పందించిన ఆర్ జే మహ్ వశ్

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముల్లాన్‌పూర్‌ మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో పిచ్‌పై పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుని 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా కేకేఆర్ 95 పరుగులకు ఆలౌట్ అయ్యింది.ఇరు జట్ల స్పిన్నర్లు వికెట్ల పండుగ చేసుకున్న పోరులో కింగ్స్‌ నిర్దేశించిన 112 పరుగుల స్వల్ప ఛేదనలో కేకేఆర్‌ 15.1 ఓవర్లలో 95 పరుగులకే చేతులెత్తేయడంతో పంజాబ్‌ 16 పరుగుల తేడాతో గెలిచింది.రఘువంశీ (28 బంతుల్లో 37, 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఆండ్రీ రస్సెల్‌ (17) పోరాడారు. పంజాబ్‌ స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్‌ (4/28), యాన్సెన్‌ (3/17) కేకేఆర్‌ను దెబ్బతీశారు. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ప్రభ్‌సిమ్రన్‌ (15 బంతుల్లో 30, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌. హర్షిత్‌ రాణా (3/25) ఆరంభంలోనే కింగ్స్‌ను దెబ్బతీయగా మిస్టరీ స్పిన్నర్లు సునీల్‌ నరైన్‌ (2/14), వరుణ్‌ చక్రవర్తి (2/21) కలిసి మిడిల్‌, లోయరార్డర్‌ పనిపట్టారు.

Advertisements

అనూహ్యం

పంబాజ్ కింగ్స్ 112 పరుగులు మాత్రమే లక్ష్యం నిర్దేశించింది. దీంతో కేకేఆర్‌ ఈ లక్ష్యాన్ని ఉఫ్‌ అని ఊదేస్తుందని అంతా భావించారు. పంజాబ్‌ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అంచనాలు అనూహ్యంగా తారుమరయ్యాయి. ఛేదనలో కేకేఆర్ తడబడింది. అందుకు ముఖ్య కారణం పంబాజ్ బౌలర్ చాహల్. అతడు తన అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచును తమ వైపునకు తిప్పాడు. మొదట ఇన్నింగ్స్‌ 8, 10 ఓవర్లలో రహానె, రఘువంశీలను ఔట్‌ చేసిన చాహల్ 12వ ఓవర్లో రింకూ సింగ్ (2), రమణ్‌దీప్‌ (0)ను ఔట్‌ చేసి కోల్‌కతాకు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇతర పంజాబ్ బౌలర్లు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మ్యాచులో ఇతర వికెట్లు తీశారు. దీంతో కేకేఆర్ 95 పరుగులకే కుప్పకూలిపోయింది.

పోస్ట్

నాలుగు కీలక వికెట్లు తీసిన చాహల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. దీంతో అతడి రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వేశ్ ఓ పోస్ట్ పెట్టింది. “వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్ హి ఈజ్. అద్భుతమైన ప్రతిభ ఉన్న వ్యక్తి. అందుకే ఈ ఐపీఎల్ లో అతడు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అసంభవ్” అంటూ అతడితో కలిసి దిగిన సెల్ఫీనీ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ తో పాటు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also: IPL 2025: అత్యధిక స్కోర్‌ ను ఛేదించిన టీమ్‌గా పంజాబ్ కింగ్స్ రికార్డ్

Related Posts
రూపాయి గుర్తు మార్పుపై పెరుగుతున్న వివాదం
రూపాయి గుర్తు మార్పుపై పెరుగుతున్న వివాదం

రూపాయి గుర్తు మార్పుపై పెరుగుతున్న వివాదం తమిళనాడు అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు మార్చి 14, Read more

2025 క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ఎప్పుడంటే?
champions trophy 2025

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి నుండి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. టోర్నీ ప్రారంభానికి Read more

SRH : సన్ రైజర్స్ కు మరో ఓటమి
srh lost match

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరోసారి పరాజయం ఎదురైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో సన్ రైజర్స్ Read more

America:అమెరికాలో విద్యను అభ్యసించాలనుకుంటున్న భారతీయ విద్యార్థులలో అనిశ్చితి
America:అమెరికాలో విద్యను అభ్యసించాలనుకుంటున్న భారతీయ విద్యార్థులలో అనిశ్చితి

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న లక్షలాది భారతీయ విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది.ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని కోరుతూ అమెరికన్‌ కాంగ్రెస్‌లో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×