భారత్ వ్యవసాయ రంగంలో మరో గర్వించదగ్గ రికార్డు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి( Rice Production)లో చైనాను వెనక్కి నెట్టి భారత్ (India) నంబర్ వన్‌గా నిలిచింది. 2024 నాటికి భారత్ 14.9 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి చేసి తొలి స్థానంలో నిలవగా, చైనా 14.46 కోట్ల టన్నులతో రెండో స్థానానికి పరిమితమైంది. ఇది భారత రైతుల కృషికి, ప్రభుత్వం చేపట్టిన సాగు ప్రోత్సాహక కార్యక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
గోధుమల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానం
ఇదే సమయంలో గోధుమల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. గత కొంతకాలంగా వాతావరణ పరిస్థితులు, సాగు విధానాల్లో మార్పులు దేశ వ్యాప్తంగా పంటల ఉత్పాదకతను ప్రభావితం చేస్తున్నప్పటికీ, బియ్యం మరియు గోధుమల ఉత్పత్తిలో భారత్ నిలకడగా ముందుకు సాగుతోంది. రైస్ ఎగుమతుల ద్వారా కూడా విదేశీ మారకద్రవ్య ఆదాయం పెరుగుతున్నది.
సాగు చేసే భూములలో మార్పులు, నీటి లభ్యత
అయితే, నూనె గింజల ఉత్పత్తి విషయంలో మాత్రం భారత్ వెనుకబడుతోంది. సాగు చేసే భూములలో మార్పులు, నీటి లభ్యత కొరత, తగిన మద్దతు ధరల లభ్యత లేకపోవడం వల్ల నూనె గింజల సాగు తగ్గుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నూనె గింజల ఉత్పత్తిని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని పరిశీలకులు సూచిస్తున్నారు. మొత్తం మీద, బియ్యం ఉత్పత్తిలో భారత్ సాధించిన ఈ విజయంతో దేశ వ్యవసాయ రంగానికి గర్వకారణంగా మారింది.
Read Also : AP Cabinet Meeting: నేడు క్యాబినెట్ భేటీలో కీలక చర్చలు