Telangana: కండక్టర్ ఇబ్బందికి స్పందించిన రేవంత్ ఊహించని ఆఫర్

Telangana: కండక్టర్ ఇబ్బందికి స్పందించిన రేవంత్ ఊహించని ఆఫర్

సాధారణంగా మనుషుల ఎత్తు, బరువుల మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. కొంతమంది చూడ్డానికి చాలా పొట్టిగా ఉంటారు. మరికొందరు చూస్తే ఏకంగా ఆజానుభావుడిలా కనిపిస్తారు. ఏడెనిమిది అడుగుల ఎత్తుతో కనిపించి అందరి చూపు తమ వైపుకు తిప్పుకుంటారు. కానీ ఆ ఎత్తు కారణంగా వారు ఎన్నో ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొంటారు. కానీ అదే ఎత్తు ఓ వ్యక్తి పాలిట శాపంగా మారింది.ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. చాంద్రాయణగుట్టకు చెందిన అమీన్ అహ్మద్ అన్సారీ అనే వ్యక్తి ఏడడుగుల ఎత్తుతో ఉన్నాడు బస్సేమో ఆరడుగులు ఉంది. దీంతో డ్యూటీలో ఉన్నంత సేపూ అతడు మెడను పక్కకు వంచి ఇబ్బందిగా పనిచేయాల్సి వస్తోంది దీంతో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అతను వాపోతున్నాడు.అతను ప్రస్తుతం మెహిదీపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

Advertisements

10గంటల ప్రయాణం

ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. ఆయన అనారోగ్యం కారణంగా 2021లో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్‌ పూర్తిచేసిన అన్సారీకి మెహిదీపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు. అతడు 7 అడుగులు పొడవు ఉండటంతో విధులు నిర్వర్తించడం సవాల్‌గా మారింది.బస్సుల్లో రోజూ సగటున 5 ట్రిప్పుల్లో 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోంది. 195 సెం.మీ.(6 అడుగుల 4 అంగుళాలు) ఎత్తుండే బస్సు లోపల 214 సెం.మీ. పొడవున్న తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండటం వల్ల మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో హాస్పిటల్స్​ చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్సారీ వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఎత్తుగా ఉండేవారు చిన్న చిన్న ప్రదేశాలలో చాలా ఇబ్బంది పడతారు. వారు వాహనాలలో ప్రయాణించలేరు. చిన్న చిన్న ఇళ్లలో ఉండలేరు. ఇక ఉద్యోగాలు చేసేవారు అయితే సమస్యలు ఎదుర్కొంటారు.

 Telangana: కండక్టర్ ఇబ్బందికి స్పందించిన రేవంత్  ఊహించని ఆఫర్

రేవంత్ రెడ్డి స్పందన

అమీన్‌ అహ్మద్‌ అన్సారీ తండ్రి కాచిగూడ డిపోలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. విధుల్లో ఉండగానే 2021లో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో కారుణ్య నియామకం కింద ఇంటర్‌ పూర్తిచేసిన అన్సారీకి ఆర్టీసీలో కండక్టర్ గా ఉద్యోగం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇక ఆయన ఎత్తుతో ఉద్యోగం చేయాలంటే తెగ ఇబ్బంది పడేవాడు. బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పులు వేస్తూ 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోందని అన్సారీ వాపోయేవాడు. ఈ క్రమంలో ఆయన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.కొందరు ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించారు. ఎత్తుతో ఇబ్బంది పడుతున్న ఆ కండక్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అతడికి ఆర్టీసీ డిపార్ట్ మెంలోనే వేరే ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇదే విషయాన్ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్సారీకి వేరే ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను పొన్నం ప్రభాకర్ ఆదేశించారు . ఈ మేరకు అన్సారీకి వేరే ఉద్యోగం ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Read Also: Hyderabad: ఆ కండక్టర్ కి హయిట్ ఏ శాపం

Related Posts
కులగణన అనేది కాంగ్రెస్ రాజకీయ స్టంట్‌ – ఎంపీ లక్ష్మణ్
mp laxman

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే (Comprehensive Household Survey) నిర్వహించడం మరియు కుల గణన (Cast Census) చేపట్టడం వివాదాస్పదమైన అంశంగా మారింది. ఈ Read more

హైదరాబాద్‌ సిటీ బస్సు ప్రయాణికులకు తీపికబురు
hyderabad city bus

గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సు ప్రయాణాలు చేసేవారికి శుభవార్త. నిమిషాలకొద్దీ బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు. బస్సు మిస్ అవుతుందన్న టెన్షన్ కూడా లేకుండా ఇంట్లో ఉండే Read more

వల్లభనేని వంశీని మరో చోటుకు తరలిస్తున్న పోలీసులు
వల్లభనేని వంశీని మరో చోటుకు తరలిస్తున్న పోలీసులు

కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు. తొలుత ఆయనను విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ కు Read more

Chandrababu Naidu: కేంద్ర జలశక్తి మంత్రితో చంద్రబాబు భేటీ
Chandrababu Naidu: కేంద్ర జలశక్తి మంత్రితో చంద్రబాబు భేటీ

విదేశీ పర్యటన ముగించిన చంద్రబాబు.. ఢిల్లీ పర్యటనలో కీలక సమావేశాలు విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న అనంతరం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×