Delimitation:ఒకే వేదికపై రేవంత్ రెడ్డి,కేటీఆర్

Delimitation:ఒకే వేదికపై రేవంత్ రెడ్డి,కేటీఆర్

2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోంది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల పెరుగుదల ఉండదని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఫలితంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయంగా లబ్ధిపొందుతాయనే భావన పెరుగుతోంది.ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

ఫెయిర్ డీలిమిటేషన్‌

డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశముండటంతో, దక్షిణాది రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం దక్కదని స్టాలిన్ అభిప్రాయపడుతున్నారు. అందువల్ల దక్షిణాదిన ఉన్న అన్ని మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు చెన్నైలో ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీ ముఖ్య డిమాండ్ “ఫెయిర్ డీలిమిటేషన్”.

సమావేశం ఏర్పాటు

ఈ సమావేశానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.రేవంత్ ,కేటీఆర్ ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.బీజేపీ-ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర పన్నుతోందంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు.ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బిజు జనతాదళ్ ప్రతినిధులు ఈ భేటీలో హాజరయ్యారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెన్నై చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. అయితే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా హాజరుకాలేనని స్పష్టం చేస్తూ స్టాలిన్‌కు లేఖ రాశారు. 

image

ప్రధాన పార్టీల ప్రాతినిథ్యం

తృణమూల్ కాంగ్రెస్‌కు కూడా ఆహ్వానం అందినప్పటికీ, ఆ పార్టీ సమావేశానికి హాజరుకాలేదు. దక్షిణాదిలో తెలుగుదేశం, జనసేన మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తటస్థ వైఖరినే కొనసాగిస్తోంది. ఫలితంగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధాన పార్టీల ప్రాతినిథ్యం లేనట్టయింది.

డీలిమిటేషన్ ప్రక్రియ

కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆఆప్), లెఫ్ట్ పార్టీలతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రులు డీలిమిటేషన్ సమావేశానికి ఆహ్వానం అందింది.డీలిమిటేషన్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అందుకే ఎక్కువమంది పిల్లలను కనాలంటూ విజ్ఞప్తి చేస్తూన్నారాయన.

Related Posts
నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు మోగనున్న నగారా
Maharashtra and Jharkhand elections will be held today

న్యూఢిల్లీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 3:30 నిముషాలకు ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా Read more

US సాయం నిలిపివేత… భారత్ పై ప్రభావం ఎంతంటే.?
usaid bharath

అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో USAID (United States Agency for International Development) ద్వారా అనేక దేశాలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. భారత్‌కు కూడా Read more

సంభాల్ జిల్లాలో శాంతి భద్రత కోసం ప్రవేశ నిషేధం: డిసెంబర్ 10 వరకు పొడిగింపు
sambhal

శాంతి, చట్టం, మరియు శాంతి భద్రతను కాపాడటానికి సంభాల్ జిల్లా పరిపాలన శనివారం బహిరంగ వ్యక్తుల ప్రవేశంపై నిషేధాన్ని డిసెంబర్ 10 వరకూ పొడిగించింది. ఈ నిర్ణయం Read more

కరెంటు కోతల కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతుంది: కేటీఆర్‌
ktr comments on congress government

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పై మరోసారి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. కరెంటు కోతల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నదని అన్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *