ఈ వారం ఓటీటీలో కొత్త సంచలనం: ‘రెట్రో’ తో పాటు మరెన్నో హైప్ క్రియేట్ చేస్తున్న కంటెంట్!
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై సినిమాలు, వెబ్ సిరీస్‌ల సందడి కొనసాగుతోంది. తెలుగు ప్రేక్షకులకు వినోద భరితమైన సినిమాలు, థ్రిల్లింగ్ సిరీస్‌లు ఎప్పుడూ ఓటీటీ ద్వారా సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా మేడే (mayday) కానుకగా థియేటర్లలో విడుదలై మంచి రివ్యూలను అందుకొని, కలెక్షన్లతో దూసుకుపోయిన సూర్య నటించిన ‘రెట్రో’ (Retro) చిత్రం ఈ శనివారం నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. దీంతో ఈ వారం ఓటీటీ లిస్టులో సరికొత్త ఊపిరిని తీసుకొచ్చే చిత్రం గా నిలుస్తోంది.
మిక్స్ డ్ టాక్ తో స్టార్ట్ – తర్వాత సూపర్ హిట్ అయ్యిన రెట్రో
సూర్య – కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెట్రో మొదట మిక్స్‌డ్ టాక్ ను ఎదుర్కొన్నప్పటికీ, క్రమంగా ప్రేక్షకుల్లో తన స్థానం సంపాదించుకుంది. పాజిటివ్ మౌత్ టాక్ ద్వారా వసూళ్లలో మంచి జంప్ వచ్చి, ఇప్పటివరకు ఈ సినిమాకు రూ. 235 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. కథ, కథన నిర్మాణం, 1990ల నోస్టాల్జియా, యాక్షన్ సీక్వెన్సులు, అలాగే సూర్య – పూజా హెగ్డే జోడీ కెమిస్ట్రీ సినిమాకు స్పెషల్ హైలైట్‌లుగా నిలిచాయి. థియేటర్లలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం సిద్ధమైంది.

నెట్‌ఫ్లిక్స్ పై రెట్రో స్ట్రీమింగ్ – మే 31 నుంచే
ఈ యాక్షన్ – రొమాంటిక్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. మే 31 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన వెలువడింది. సూర్య అభిమానులతో పాటు యాక్షన్ మాస్ సినిమాలను ఇష్టపడే వారందరికీ ఇది పండగే అనొచ్చు. 1990ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథనంలో సూర్య పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్, సంతోష్ నారాయణన్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్‌తో రెట్రో ఓ ప్రత్యేకమైన సినిమా అనిపిస్తోంది.
స్టార్ కాస్ట్ – టెక్నికల్ టీమ్ బలంగా నిలిచిన సినిమా
ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ నటులు జోజు జార్జ్, ప్రకాష్ రాజ్, నాజర్, జయరాం, సుజిత్ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్‌బీచ్ ఫిల్మ్స్ బ్యానర్ల పై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. టెక్నికల్ టీమ్ విషయానికొస్తే, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, మ్యూజిక్ అన్నింటిలోనూ స్థాయికి మించి కంటెంట్ అందించగలిగారు.
ఓటీటీలో ఈ వారం మరిన్ని సర్ప్రైజ్‌లు
రెట్రో తో పాటు ఈ వారం ఓటీటీలో మరిన్ని వెబ్ సిరీస్‌లు, ఇతర భాషల సినిమాలు కూడా సందడి చేయనున్నాయి. క్రైమ్ థ్రిల్లర్లు, కామెడీ డ్రామాలు, హారర్ థీమ్స్ ఉన్న సిరీస్‌లు, అంతర్జాతీయ కాన్సెప్ట్‌లు ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీలు కూడా ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా యూత్ ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన కొన్ని కొత్త హిందీ వెబ్ సిరీస్‌లు, తమిళ మిస్టరీ డ్రామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.
read also: Kenisha: అసభ్య సందేశాలతో వేధిస్తున్న వారి పై కెనీషా తీవ్ర హెచ్చరిక