మూడోసారి కూడా నేనే అధ్యక్షుడుగా వుంటాను: ట్రంప్

Donald Trump: ట్రంప్‌ను మైక్‌తో కొట్టిన రిపోర్టర్.. అయన రియాక్షన్ ఏంటంటే?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను అల్లాడిస్తున్నారు. అయితే తాజాగా ఆయనే షాకయ్యే పని చేసింది ఓ మహిళా రిపోర్టర్. ముఖ్యంగా ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా.. ఓ మహిళా రిపోర్టర్ అత్యుత్సాహం ప్రదర్శించింది. పైన పైన పడుతూ ప్రశ్నలు అడగ్గా.. ఆమె మైక్ ట్రంప్ ముఖానికి తాకింది. దెబ్బ తగిలిన వెంటనే ట్రంప్ ముఖం మారిపోయింది. కనుబొమ్మలతోనే ఆయన ఆమెను బెదిరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చివ తేదీ శుక్రవారం రోజు అమెరికాలోని మేరీల్యాండ్‌లోని జాయింబ్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయం నుంచి బయలు దేరి ఎయిర్ ఫోర్స్ వన్ వేఎక్కే ముందు.. మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యంగా ప్రస్తుతం గాజా పరిస్థితి ఎలా ఉంది, యుద్ధానికి సంబంధించిన విషయాలపై ప్రశ్నలు అడిగారు. ఓవైపు ట్రంప్ సమాధానాలు చెబుతుండగా.. మరోవైపు రిపోర్టర్లు పోటీ పడి మరీ ప్రశ్నలు సంధించారు.
టెలివిజన్‌లో హాట్ టాపిక్‌గా ..
ఈక్రమంలోనే ఓ మహిళా రిపోర్టర్ తన బూమ్ మైక్రోఫోన్‌ను పట్టుకుని.. ప్రశ్న అడిగేందుకు మరింత ముందుకెళ్లింది. దీంతో మైక్ ట్రంప్ ముఖానికి తాకగా.. ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు. వెంటనే తన కనుబొమ్మలను ఎగిరేస్తూ.. ఆ మహిళా రిపోర్టర్ వైపు కోపంగా చూశారు. ఆపై వెంటనే ప్రశ్న అడుగుతున్న మరో రిపోర్టర్‌పైకి దృష్టి మళ్లించారు. కానీ ప్రశ్న అడగడం పూర్తి కాగానే.. తనకు దెబ్బ తగిలించిన రిపోర్టర్ ముఖం చూసి మీరు ఈరోజు టెలివిజన్‌లో హాట్ టాపిక్‌గా మారబోతున్నారని అన్నారు.

Related Posts
HMPV వైరస్ వ్యాప్తి.. గాంధీలో ప్రత్యేక ఏర్పాట్లు
hmpv gandhi hospital

HMPV (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఈ వైరస్ కరోనా వైరస్‌కు భిన్నమని, అంత ప్రమాదకరం Read more

శంషాబాద్‌లో వైష్ణోయ్ సౌత్‌వుడ్స్‌ను ఆవిష్కరించిన వైష్ణోయ్ గ్రూప్
Vaishnoi Group Launches Vai

హైదరాబాద్, నవంబర్ 15, 2024 - శంషాబాద్‌లోని మామిడిపల్లిలో ప్రత్యేక విల్లా కమ్యూనిటీ వైష్ణోయ్ సౌత్‌ వుడ్స్‌ను ప్రారంభించినట్లు వైష్ణోయ్ గ్రూప్ సగర్వంగా ప్రకటించింది. ఈ గ్రాండ్ Read more

స్టాలిన్‌ పై త‌మిళ‌సై మండిపాటు
స్టాలిన్‌ పై త‌మిళ‌సై మండిపాటు

తమిళనాడులో భాషా వివాదం మళ్లీ చర్చనీయాంశమైంది. హిందీ భాషా వ్యతిరేకత, భాషా విధానాలు, విద్యా వ్యవస్థపై నియంత్రణ తదితర అంశాలపై డీఎంకే ప్రభుత్వాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. Read more

ప్రపంచ కుబేరుల జాబితా.. అరుదైన ఘనతను సొంతం చేసుకున్న జుకర్‌ బర్గ్‌
Zuckerberg passes Bezos to become worlds second richest person

Zuckerberg passes Bezos to become world’s second-richest person న్యూయార్క్‌ : మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే Read more