Relief for YS Jagan in the Supreme Court

వైఎస్ జగన్‌కు సుప్రీంకోర్టులో ఊరట

వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు జగన్ పై ఉన్న కేసులను బదిలీ చెయ్యాలని రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇక, జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది సోమవారం వెనక్కి తీసుకున్నారు. ఈ పిటిషన్ పై జనవరి 27న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. జగన్ ఆస్తుల కేసులో ట్రయల్ సరిగా జరగడం లేదని రఘురామకృష్ణరాజు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కేవలం, శుక్ర,శనివారాల్లో మాత్రమే ఈ కేసుపై విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. వైఎస్ జగన్ ఆస్తుల కేసులను బదిలీ చేయాలని.. బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాతో కూడిన సుప్రీం ధర్మాసనం తెలిపింది.

ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు ప్రత్యేక కోర్టులు రోజువారీగా విచారణ చేయాలని జగన్ తరపు న్యాయవాది కోరారు. దీంతో జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో తన పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రఘురామకృష్ణ రాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

images

కాగా, ఈరోజు రఘురామకృష్ణంరాజు పిటిషన్ పై జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం విచారణ జరిపారు. ఈ తరుణంలోనే పిటిషనర్ రఘురామ కృష్ణం రాజు, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వాదనలు జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం సభ్యులు విన్నారు. ఈ క్రమంలోనే జగన్ పై ఉన్న కేసులను బదిలీ చెయ్యాలని రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఉన్నత న్యాయం స్థానం డిస్మిస్ చేసింది. దీంతో సుప్రీం కోర్టులో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఊరట లభించింది.

Related Posts
గర్భిణులు బాలింతలు జాగ్రత్త
గర్భిణులు బాలింతలు జాగ్రత్త

గర్భిణులు బాలింతలు జాగ్రత్త.ఆంధ్రప్రదేశ్‌లో గర్భిణులు, బాలింతలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు ఫేక్ లింకులు, మెసేజెస్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. 'జనని సురక్ష యోజన' పథకం ద్వారా Read more

నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం ఓకే
Ashwini Vaishnaw

క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయంసమృద్ధి లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.16,300 కోట్ల వ్యయంతో ఈ మిషన్ అమలు Read more

250 ఏళ్ల క్రితం కట్టబడిన ఆలయం కానీ.
250 ఏళ్ల క్రితం కట్టబడిన ఆలయం కానీ.

ఏ గుడికెళ్లినా దేవుడు ఉంటాడు, పూజలు జరిగేవి, భక్తులు వస్తుంటారు.కానీ, ఈ గుడిలో మాత్రం విషయం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పూజారి లేదు, భక్తులు కూడా కనిపించరు. Read more

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25..మీ నిజమైన ఏఐ సహచరుడు: టిఎం రోహ్
Samsung best smartphone, the Galaxy S25: Your true AI companion: TM Roh

న్యూఢిల్లీ: గెలాక్సీ ఎస్25 అనేది కెమెరా మరియు బ్యాటరీ కోసం హార్డ్‌వేర్‌లో సాటిలేని నాయకత్వంతో వస్తున్న అతి సన్నటి మరియు అత్యంత మన్నికైన స్మార్ట్‌ఫోన్. ఇది గెలాక్సీ Read more