దేశంలోని మీడియా రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించిన రిలయన్స్ జియో ప్రస్తుతం అన్ లిమిటెడ్ ఆఫర్‌తో ప్రజల ముందుకు తిరిగి వచ్చేస్తోంది. త్వరలోనే ఐపీఎల్ సీజన్ మెుదలు కానున్న వేళ భారతదేశంలోని క్రికెట్ అభిమానుల కోసం మళ్లీ క్రేజీ స్ట్రీమింగ్ ఆఫర్ అందుబాటులోకి తీసుకొస్తోంది.
జియో క్రికెట్ ప్రేమికులకు ఒక ప్రత్యేక ఆఫర్
వాస్తవానికి భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. అది భారతీయ ప్రజల మనోభావాలకు, సంస్కృతికి, జీవనశైలికి సంబంధించినదిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో అంబానీకి చెందిన ప్రముఖ టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో క్రికెట్ ప్రేమికులకు ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. 2025 క్రికెట్ సీజన్ ప్రారంభం కోసం జియో ఈ “అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్”ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ క్రికెట్ అభిమానులకు 4Kలో జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్, జియోఫైబర్/ఎయిర్‌ఫైబర్ 50 రోజుల ఉచిత ట్రయల్‌ను ఆఫర్ చేస్తోంది.

ఆఫర్ కింద ముఖ్యమైన అంశాలు
ఈ ఆఫర్ కింద క్రికెట్ అభిమానులు జియో హాట్‌స్టార్ ద్వారా ప్రతి మ్యాచ్‌ను 4K క్వాలిటీలో ఉచితంగా చూడవచ్చు. ఇది 2025 మార్చి 22 నుంచి ప్రారంభం అవుతుంది. 90 రోజుల పాటు ఈ సేవ అందుబాటులో ఉంటుంది. 4K స్ట్రీమింగ్ అనేది ఎక్కువ వీడియో క్లారిటీ, నాణ్యత, సౌండ్ ఎఫెక్ట్స్‌ను అందించే ఒక అధిక స్థాయి వినోదాన్ని అందిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా టీవీ లేదా మొబైల్ ఫోన్ ద్వారా క్రికెట్ మ్యాచ్‌లను చూడడం మరింత ఆసక్తికరంగా మారనుంది.
ఈ ఆఫర్ హోమ్ యూజర్ల కోసం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. వారు జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్ సేవలను 50 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ సేవలో 800+ టీవీ చానళ్ళు, 11+ OTT యాప్స్, అన్‌లిమిటెడ్ WiFi బండిల్ చేయబడ్డాయి. రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ఆఫర్‌ను అన్ని కొత్త, ఓల్డ్ జియో సీఐఎం కస్టమర్ల కోసం అందిస్తోంది. కొత్త కస్టమర్లు జియో సీఐఎం కొనుగోలు చేసి రూ.299 లేదా ఎక్కువ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉన్నత రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకున్న ప్రస్తుత కస్టమర్లకు కూడా ఈ ఆఫర్ అందించబడుతుందని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే మార్చి 17, 2025 నాటికి జియో సీఐఎం రీఛార్జ్ చేసిన వారు రూ.100 అదనపు ప్యాక్‌ను కొనుగోలు చేసి ఈ ఆఫర్‌ను ప్రారంభించవచ్చు. జియో హాట్‌స్టార్ ప్యాక్ మార్చి 22న ప్రారంభమై 90 రోజుల పాటు చెలామణి అవుతుంది.
ఉత్తమ డిజిటల్ సేవలు
జియో దేశంలో మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేవల రంగంలో తన వ్యాప్తిని పెంచుకోవడానికి, వినియోగదారులకి ఉత్తమమైన డిజిటల్ సేవలను అందించడానికి ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ ద్వారా జియోకి ఉన్నత స్థాయిలో మార్కెట్ పై ప్రభావాన్ని చూపేందుకు అవకాశం ఉంది. 5G నెట్‌వర్క్ సేవలు, OTT ప్లాట్‌ఫారమ్‌లు, ఇంటర్నెట్ ప్లాన్లతో, జియో భారతదేశంలో డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో లీడర్ కావటానికి ఒక క్రమబద్ధమైన వ్యూహాన్ని అమలు చేస్తుంది.